ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబో లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం రికార్డులని కొల్లగొడుతోంది..ఒక పక్క మాస్ మరో పక్క క్లాస్ ప్రేక్షకులని అలరిస్తున్న ఈ సినిమా భవిష్యత్తులో ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో ఊహించని రీతిలో ఉంది..అరవింద సమేత మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా  30కోట్లు నెట్ కలక్షన్స్ వసూలు చేయగా ఇప్పటి వరకూ   ఉన్న నాన్ 'బాహుబలి' రికార్డులను బ్రేక్ చేయడంతో  ఒక్క సారిగా ఎఫెక్ట్ అంతా వచ్చే సంవత్సరం విడుదల కాబోతున్న “చరణ్ , మహేష్ ప్రభాస్” లాంటి యంగ్ స్టార్ హీరోస్ పై పడనుందని టాక్ వినిపిస్తోంది.

 Image result for aravinda sametha

ఇదిలాఉంటే  ఈ కలెక్షన్ల ప్రవాహంతో షేక్ అయిపోతున్న టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోస్ ఒక్కొక్కరుగా అరవింద కంటే కూడా తమ సినిమాలకి భారీ కలెక్షన్లు వచ్చేలా వ్యుహాలని సిద్దం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.. సినిమా  విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం 'అరవింద సమేత' సృష్టించిన నాన్ 'బాహుబలి' రికార్డులు ప్రభాస్ సాహో విడుదల అయ్యే వరకూ కొనసాగుతాయని దాంతో ఇప్పుడు యంగ్ హీరోలకి ఇదొక పెద్ద ఛాలెంజ్ గా మారనుందని అంటున్నారట

 Image result for prabhas saho

అయితే ఇప్పటి వరకూ బాగానే ఉన్నా  తెలుగు రాష్ట్రాలు రెండిటిలో కూడా “అరవింద సమేత” మొదటిరోజు కలక్షన్స్ “బాహుబలి 2”  కలక్షన్స్ ను దాటేయడం ప్రభాస్ కి షాక్ కలిగించే న్యూస్ అనే చెప్పాలి.అయితే ప్రభాస్ ఈ పరిణామాలతో  కొత్త సినిమా సాహో విషయంలో జాగ్రత్తా వ్యవహరించాలని ప్లాన్ చేస్తున్నారట..ప్రభాస్ తన 'సాహో' ను ఒకేసారి దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడ వచ్చే ఏడాది సమ్మర్ ను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతోంది..అయితే అరవింద కంటే భారీ బడ్జెట్ లో సాహో నిర్మించడంతో ప్రభాస్ పై మరింత ఒత్తిడి కలుగుతుండనడంలో సందేహం లేదనే చెప్పాలి..ఈ క్రమంలో అరవింద ఎఫెక్ట్ తనపై పడకుండా ఎన్టీఆర్ రికార్డ్ లని బీట్ చేసేలా ప్రభాస్ ఎలాంటి వ్యుహాలని అనుసరిస్తాడో చూడాలి మరి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: