మీ టూ ..  ఉద్యమం తార స్థాయికి చేరుకున్నది సినీ ఇండస్ట్రీలో జరగుతున్న చీకటి కోణాలను హీరోయిన్స్ బయట పెడుతున్నారు. 2016లో బాబుమోషాయ్ బదూక్‌బాజ్ షూటింగ్ సమయంలో దర్శకుడు కుషన్ నందీ తనతో ప్రవర్తించిన విధానాన్ని మరోసారి ఎండగట్టింది. ఎందుకు ఆ సినిమా నుంచి తప్పుకొన్నానో అనే విషయాన్ని వివరించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బాబుమోషాయ్ బదూక్‌బాజ్ చిత్ర షూటింగ్‌ సమయంలో నవాజుద్దీన్ సిద్ధిఖీతో మంచంపై ఓ సీన్ చేయాల్సింది.

మంచంపై నవాజుద్దీన్ సిద్ధిఖీతో

నాకు గుండీలు లేని జాకెట్ తొడిగించి, కేవలం లంగాపై ఉంచారు. ఆ సినిమాలో ముందు చెప్పని సీన్‌ను హడావిడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సీన్ షూట్‌లో ఉండగా దర్శకుడు కుషాన్ వచ్చి.. లంగా పైకి ఎత్తి.. కాళ్లు వెడల్పుగా చాపి నవాజుద్దీన్‌పై పడుకో అని చెప్పాడు. తాను అభ్యంతరం చెబుతున్నా నా మాటలు పట్టించుకోలేదు. ఆపై దారుణంగా బిహేవ్ చేశాడు. దర్శకుడు కుషాన్ నాతో దారుణంగా ప్రవర్తిస్తున్నా నవాజుద్దీన్ సిద్ధిఖి ఏం మాట్లాడకుండా చూస్తుండిపోయాడు.

దారుణంగా ప్రవర్తిస్తున్నా నవాజుద్దీన్ సిద్దిఖీ

అంతేకాకుండా సినిమా ప్రమోషన్ విషయంలో మాట్లాడుతూ.. రెండుసార్లు ఓ సీన్‌లో మజా చేశాను అని చెప్పడానే విషయాన్ని గుర్తు చిత్రంగదా గుర్తు చేసింది. అలాంటి సీన్లు నచ్చకపోవడంతో ఆ సినిమా నుంచి తప్పుకొన్నాను అని వెల్లడించింది.  చిత్రంగదా తమపై చేసిన ఆరోపణలను దర్శకుడు కుషాన్ తోసిపుచ్చాడు. సరిగా నటించకపోవడం వల్లనే ఆమెను ఆ సినిమా నుంచి తప్పుకోమని చెప్పాం. ఆ తర్వాత ఆమె స్థానంలో బిదితా బేగ్‌ను తీసుకొన్నామని కుషాన్ చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: