భారత దేశంలో ఇప్పుడు #MeToo ద్వారా  మహిళలు మాత్రమే తమ అనుభవాలను తెలిపారు. ఈ జాబితాలో కొత్తగా నటుడు కూడా చేరాడు. అతను మరెవ్వరో కాదు బాలీవుడ్ హీరో, కరీనా కపూర్ భర్త సైఫ్ అలీఖాన్. ఈ మద్య మీటూ ఉద్యమంలో ఎంతో మంది సెలబ్రెటీలు బయటకు వచ్చి తమ బాధల్ని వెల్లబుచ్చుతున్నారు.  కాగా మీ టూ పై స్పందిస్తూ.. పాతికేళ్ల కిందట తాను కూడా వేధింపులు ఎదుర్కొన్నానంటూ అప్పట్లో జరిగిన ఓ ఘటన గుర్తుతెచ్చుకున్నాడు.  గత కొన్ని రోజుల నుంచి బాలీవుడ్, టాలీవుడ్, మీడియా, పొలిటిక్స్... ఎక్కడ చూసినా, ఎవ్వరినీ కదిలించినా ‘మీ టూ’ గురించి చర్చ వస్తోంది. తనుశ్రీదత్తా, వినితా నందా, ఆశాశైనీ, జ్వాలా గుప్తా, కంగనా రనైత్, కేట్‌శర్మ, పూజామిశ్రా... ఇలా ఒక్కొక్కరుగా తమకు జరిగిన చేదు అనుభవాలను బహిరంగంగా ప్రస్తావించిన విషయం తెలిసిందే. 

Image result for saif ali khan

తాజాగా మీ టూ లో భాగంగా పురుషులకు కూడా ఇబ్బందులు ఉన్నాయని చెప్పిన సెలబ్రెటీ సైఫ్ అలీఖాన్.   పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కైఫ్ మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్‌లో నేను కూడా వేధింపులు ఎదుర్కొన్నా. అయితే, లైంగికంగా కాదు. కానీ, పాతికేళ్ల కిందట ఎదుర్కొన్న ఆ చేదు అనుభవం గుర్తు తెచ్చుకుంటే ఇప్పటికీ నాకు కోపం వస్తుంది. చాలామంది ఇతరులను అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు.  ఎదుటివారు బాధపడుతుంటే చూసి సంతోషించే వాళ్లు కూడా మన చుట్టూనే ఉన్నారు.

Image result for saif ali khan

నేను ఎదుర్కొన్న వేధింపుల గురించి ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే అప్పుడూ, ఇప్పుడూ నేను అంత ముఖ్యమైన వ్యక్తిని కాదు. మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ‘మీ టూ’ ఉద్యమంలో బయటికి వచ్చిన వ్యక్తులతో భవిష్యత్తులో కలిసి పని చేయబోనని ఖరాకండి చెప్పేశాడు సైఫ్ అలీ ఖాన్.

Image result for #mee too

‘లైంగికంగా మహిళలను వేధించిన వారందరికీ శిక్ష పడాల్సిందే. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో జరుగుతున్న రాద్ధాంతం, భవిష్యత్తులో మహిళలకు భద్రత కల్పించేందుకు ఉపయోగపడుతుంది. సాజీద్ ఖాన్‌పై వస్తున్న ఆరోపణలపై సైఫ్ స్పందిస్తూ.. ‘హంషకల్స్’ సెట్‌లో ఏం జరిగిందో తనకు గుర్తు లేదని సైఫ్ తెలిపాడు. తన ఎదురుగా ఎవరైనా అలాంటి పనులు చేస్తే తనకు చాలా అసౌకర్యంగా అనిపిస్తుందన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: