వర్మ ఏది చేసిన తన సినిమా కు అవలీలగా పబ్లిసిటీ వచ్చేస్తుంది. ఎప్పడూ వివాదాల్లో నలగడం వర్మకు కొత్తేమి కాదు మొన్న ఆ మధ్య జి యస్ టి అంటూ సంచలనం రేపినాడు. రామ్ గోపాల్ వర్మ సమర్పణలో 'భైరవగీత' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ధ‌నంజ‌య‌, ఇర్రా మార్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ తాతోలు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 12న విడుదల చేయాలనుకున్నారు కానీ వీలు పడలేదు. దీంతో వర్మ సరికొత్త ఐడియాకు తెరలేపారు.

రాయలసీమ లవ్ స్టోరీ

భైరవగీత' దసరా రిలీజ్ వాయిదా పడటంతో ఈ చిత్రం గురించి ప్రేక్షకులు మరిచిపోకుండా ఉండటానికి, ఈ మూవీ గురించి టాక్ లైమ్ లైట్లో ఉండటానికి ధ‌నంజ‌య‌, ఇర్రా మార్ ఇంటిమేట్ సీన్లకు సంబంధించిన ఫోటోలను వర్మ విడుదల చేశారు. వర్మ విడుదల చేసిన ధ‌నంజ‌య‌, ఇర్రా మార్ రొమాంటిక్ ఫోటోస్ ప్రేక్షకులను టెమ్ట్ చేసే విధంగా ఉన్నాయి.

భైరవగీత

ఈ ఫోటోస్ చూస్తుంటే సినిమాలో రొమాంటిక్ సీన్లు ఏ రేంజిలో ఉంటాయో? అని చర్చించుకుంటున్నారు. రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో తెర‌కెక్కిన యాక్ష‌న్ ప్యాక్ ప్రేమ‌క‌థ ఈ ‘భైర‌వ‌గీత'‌. ఇప్ప‌టికే విడుద‌లైన భైర‌వ‌గీత ట్రైల‌ర్‌ మంచి స్పందన వచ్చింది. సినిమాపై అటెన్షన్ తగ్గకుండా ఉండటానికి వర్మ తనదైన శైలిలో పబ్లిసిటీ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: