ఎవరికైన ముద్దు, హగ్గు అంటే ముచ్చటే కానీ భయం ఉంటుందా. అందమైన పడుచు పిల్లను చూస్తే బ్రహ్మకైన రిమ్మ తెగులు పుడుతుందని అంటారు. ఇక కోరి వచిన వనితను ఎవరూ వదులుకోరు కూడా. మరి కౌగిలింత ఇస్తాను మగడా అంటే పులకరింతకు బదులు కలవరింతలు పెడతారా. కానీ ఆయన మాత్రం నో అనేశాడట.


అమలాపాల్ అందమైన  అమ్మాయి. చూడ ఛ‌క్కని సౌందర్యంతో  మక్కువ పెంచే బ్యూటీ. తెలుగులో ఇద్దరమ్మాయిలతో అల్లు అర్జున్, ఆ తరువాత రాం చరణ్ తో నాయక్ ఇలా అనేక మూవీస్ చేసి కుర్ర కారు ని గిలిగింతలు పెట్టిన సొగసులాడి. ఆమె ఇపుడు తమిళ్, ఇతర భాషా చిత్రాల్లో బిజీగా ఉంటోంది. అటువంటి అమలాపాల్ కోరి నీకు హగ్ ఇస్తాను అంటే వద్దు అని వెనక్కు జరిగాడట ఓ దర్శకుడు. ఇది ఇపుడు అన్ని కోలివుడ్ సహా అన్ని ఛోట్లా హాట్ టాపిక్ గా మారింది.


అమలా పాల్ తాజాగా ‘రాక్షసన్’ అనే తమిళ్ చిత్రంలో నటించింది. ఆ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్బంగా అమలా పాల్  సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత చాలా బాగా వచ్చిందని సినిమాను బాగా తీశారంటూ దర్శకుడు రామ్ కుమార్ ను అభినందించేందుకు ఆయన్ను హగ్ చేసుకునేందుకు ప్రయత్నించగా ఆయన కంగారు పడి తప్పించుకున్నాడని అమలా పాల్ నవ్వుతూ చెప్పుకొచ్చింది.


అదంతా మీటూ ప్రభావమేనని అంటున్నారు. ఏమో ఎందుకొచ్చింది కౌగిలింత అనుకున్నాడో ఏమో ఆ పురుష పుంగవుడు నైస్ గా వద్దు అని తప్పించేసుకున్నాడట. నిజమే ఈ హగ్గులు పెగ్గులు ఇప్పటి ముచ్చట, రేపటికి ఏ రచ్చ పెడతాయో కదా. ఎంతైనా రాం కుమార్ తెలివిగానే వ్యవహరించాడని సోషల్ మీడియాతో ఓ వర్గం అంటూంటే లేదు అందమైన కౌగిలింతను దూరం చేసుకున్నాడు బాడ్ లక్ అంటోంది మరో వర్గం. 


మరింత సమాచారం తెలుసుకోండి: