యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సరైన విజయం పడితే బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు ఎలా ఉంటాయో అరవింద సమేత చిత్రం నిరూపించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో రూపొందిన ఈ చిత్రం అద్భుత విజయం దిశగా దూసుకుపోతోంది. ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటనకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. గురువారం విడుదలైన ఈ సినిమా ఈ 4 రోజుల్లో వరల్డ్ వైడ్ 100 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో చోట్ల నాన్-బాహుబలి రికార్డులు క్రియేట్ చేసింది. అలా 4 రోజుల్లో 49 కోట్ల రూపాయల షేర్ సాధించింది.

ఎన్టీఆర్ నటనకు ప్రశంసలు

చిత్రంలో కాస్త ఎంటర్ టైన్మెంట్ తగ్గినా త్రివిక్రమ్ రూపొందించిన ఎమోషనల్ సీన్స్ కు ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు.   అటు ఓవర్సీస్ లో 1.65 మిలియన్ డాలర్లతో దూసుకుపోతోంది అరవింద సమేత. త్రివిక్రమ్ క్రేజ్ కు, ఎన్టీఆర్ స్టామినా యాడ్ అవ్వడంతో యూఎస్ లో ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఏపీ, నైజాంలో అరవింద సమేత ఫస్ట్ వీకెండ్ వసూళ్లు ఇలా ఉన్నాయి. 

aravinda sametha collections on monday morning

ఒక థియేటర్ నుండి 'అరవింద సమేత' సినిమాను తీసేశారు. కొన్ని థియేటర్లలో తొంబై శాతం ఆక్యుపెన్సీతో నడిచినట్లు తెలుస్తోంది. దసరా సెలవులు కాబట్టి సినిమా మళ్లీ పుంజుకొని తన సత్తా చాటుకుంటుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు.  ఇక రామ్, అనుపమా పరమేశ్వరన్ నటించిన ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమా హిట్, ఫ్లాప్ టాక్ ని బట్టి ‘అరవింద’ కలెక్షన్లు ఉండబోతాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. 

‘అరవింద సమేత’ ఏరియావైజ్ కలెక్షన్లు :

నైజాం - 15.00 కోట్లు

సీడెడ్ - 11.81 కోట్లు

ఉత్తరాంధ్ర - 5.93 కోట్లు

ఈస్ట్  - 4.29 కోట్లు

వెస్ట్ - 3.52 కోట్లు

కృష్ణ - 3.77కోట్లు

గుంటూరు - 6.37 కోట్లు

నెల్లూరు - 1.96 కోట్లు

Total - Rs 52.65 కోట్లు (ఏపీ + తెలంగాణా 5 రోజుల షేర్)

మరింత సమాచారం తెలుసుకోండి: