తెలుగు చిత్ర పరిశ్రమలో మహానటులు ఎన్టీఆర్ కి ఎంతో ప్రత్యేకత ఉంది..తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసి..చలన చిత్ర రంగంలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటులు విశ్వనట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవితానికి సంబంధించిన సినిమా 'ఎన్టీఆర్'బయోపిక్ తెరకెక్కిస్తున్న విషయం గురించి తెలిసిందే.  అయితే ఈ సినిమాను రెండు భాగాలుగా తీస్తున్నట్లు ఈ మద్య దర్శకులు క్రిష్ ప్రకటించిన విషయం తెలిసిందే.  ఎన్టీఆర్ నట జీవితానికి సంబంధించిన మొదటి భాగం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ జనవరి 9న రిలీజ్ చేయబోతున్నట్లు..ఆయన రాజకీయ నేపథ్యంలో సాగిన రెండోభాగం ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ జనవరి 24 రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. 

అయితే ఈ సినిమాలో ముఖ్యపాత్రలకు సంబంధించి ఒక్కో స్టిల్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు.  ఇప్పటి వరకు ఏఎన్ ఆర్ పాత్రలో సుమంత్, సీఎం చంద్రబాబు పాత్రలో రానా, నటి శ్రీదేవి పాత్రలో రకూల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ మద్య నందమూరి హరికృష్ణ పాత్రలో కళ్యాన్ రామ్ ఫోటో రిలీజ్ చేశారు.  కానీ ఈ ఫోటోలో కళ్యాన్ రామ్ ని చూపించలేదు.  ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో హరికృష్ణ తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు..ఆయన వాహనం చైతన్య రథాన్ని స్వయంగా హరికృష్ణ నడిపేవారు. 

ఈ మద్య రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ కన్నుమూసిన విషయం తెలిసిందే.  తాజాగా ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో నటించిన విద్యాబాలన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.   బసవతారకంలా అద్దం ముందు కూర్చుని ఉన్న విద్యా బాలన్‌ లుక్‌ను రిలీజ్ చేశారు. అంతేకాదు ఈ ఫోటోపై ‘What do I See ?!! అని ఉంది. మొత్తానికి ఒక్కో లుక్‌తో ‘ఎన్టీఆర్’ బయోపిక్ మూవీపై అంచనాలు పెరిగిపోతున్నాయి. 

Image result for ntr biopic kalyan ram



మరింత సమాచారం తెలుసుకోండి: