దసరా బరిలో రిలీజ్ అయినా  హలో గురు ప్రేమ కోసమే సినిమా సగటు ప్రేక్షకుడుని మెప్పించలేదని చెప్పాలి. రెండు, మూడు సీన్లు లూప్‌లో వేసి అవే మళ్లీ మళ్లీ తిప్పి చూపిస్తూ వినోదానికి చేతులారా చరమగీతం పాడేసారు. ప్రథమార్ధంలో పండించిన కామెడీని ద్వితియార్ధంలో కూడా వుండేట్టు చూసుకున్నట్టయితే స్టోరీ, స్క్రీన్‌ప్లే లాంటి వాటి గురించి చర్చించుకోవాల్సిన పని లేకుండా ఈ ప్రేమ పాస్‌ అయిపోయేది.

Image result for hello guru prema kosame

కానీ మరోసారి దర్శకుడు త్రినాధరావు 'మామ-అల్లుళ్ల' ఛట్రంలో పడి చివరకు కథానాయికని కూడా సైడ్‌ ట్రాక్‌ చేసేయడంతో పతాక సన్నివేశానికి ముందు హడావిడిగా ప్రేమని కన్ఫెస్‌ చేయడానికి మినహా ఆమెకి పెద్దగా పని పడలేదు. పోనీ ద్వితియార్థంలో హాస్యానికి స్కోప్‌ లేదా అంటే... కావాల్సినంత గ్యాప్‌ వుంది కానీ హాఫ్‌ బేక్డ్‌ సీన్ల వల్ల అదేమీ పండలేదు. చివరకు ఏమి జరుగుతుందో, ఎలా జరుగుతుందో కూడా అర్థమైపోతున్న కథని కాపాడాల్సినవి రెండే ఎలిమెంట్లు. ఒకటి పొట్ట చెక్కలయ్యే కామెడీ కాగా, మరొకటి వీనులవిందైన మ్యూజిక్కు.

సినిమా రివ్యూ: హలో గురు ప్రేమకోసమే...

దురదృష్టవశాత్తూ సెకండ్‌ హాఫ్‌లో సరిపడా కామెడీ లేదు, దేవిశ్రీప్రసాద్‌ మ్యూజిక్‌ కనీసం ఫస్ట్‌ హాఫ్‌లోను మ్యాజిక్‌ చేయలేదు. ఎక్కడో వినేసినట్టున్న పాటలే అన్నీను. నేపథ్య సంగీతం కూడా అన్యమనస్కంగా 'మమ' అనిపించినట్టే అనిపిస్తే అది మన తప్పుకాదు. రామ్‌కి ఇలాంటి పాత్రలు కొత్త కాదు. ప్రకాష్‌రాజ్‌ చేయని పాత్ర లేదు. ఇద్దరి మధ్య కుదిరిన కెమిస్ట్రీ మెప్పించగా, అనుపమ ఎక్కువగా బ్యాక్‌గ్రౌండ్‌కే పరిమితమైంది. మిగిలిన వారిలో చాలా మందివి 'కరివేపాకు' తరహా పాత్రలే తప్ప గుర్తుండే లక్షణాలు, అభినయాలు లేవు. ముందే చెప్పినట్టు పాటలు ఆకట్టుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: