కోలీవుడ్ క్రేజీ కాంబినేషన్ అయిన మురుగదాస్, విజయ్ లు ప్రస్తుతం సర్కార్ సినిమా చేస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన జిల్లా, కత్తి, తుపాకి సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. ఇక ఇప్పుడు సర్కార్ గా ఈ కాంబోలో సినిమా వస్తుంది. దసరా సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.


రిలీజైన టీజర్ చూతే మురుగదాస్ మార్క్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మరోసారి విజయ్ తన సినిమా ద్వారా రాజకీయాలను టచ్ చేశాడు. సర్కార్ అనే టైటిలే సినిమా కాన్సెప్ట్ ఏంటో తెలిసేలా చేసిన మురగదాస్ ఈ సినిమాతో సత్తా చాటాలని చూస్తున్నాడు. టీజర్ అయితే అదిరిపోయేలా ఉందని చెప్పొచ్చు.


కాన్సెప్ట్, టేకింగ్ అన్ని విజయ్ క్రేజ్ కు తగినట్టుగా అదిరిపోయాయి. దీపావళి కానుకగా కోలీవుడ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా తెలుగులో డబ్ చేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. పొలిటికల్ ఫీవర్ ఉన్న ఈ టైంలో అదే బ్యాక్ డ్రాప్ తో వస్తున్న సర్కార్ కచ్చితంగా సంచలనాలు సృష్టించే అవకాశాలున్నాయి.


లాస్ట్ ఇయర్ మహేష్ తో స్పైడర్ సినిమా తీసిన మురుగదాస్ ఆ సినిమాతో ఫ్లాప్ చవిచూడాడు. ఎన్నో భారీ అంచనాల నడుమ వచ్చిన స్పైడర్ తెలుగు, తమిళం రెండు భాషల్లో రిలీజైనా ఫలితం ఆశించినంతగా అందుకోలేదు. అందుకే విజయ్ తో సర్కార్ అంటూ సంచలనానికి సిద్ధమయ్యాడు మురుగదాస్. మరి ఈ సినిమా అనుకున్న అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: