‘మీటూ’ ఉద్యమం ఇప్పుడు అన్ని రంగాల్లోకి ప్రవేశించి మహిళలను చైతన్య పరుస్తుంది.  హాలీవుడ్ లో మొదలైన మీటూ ఉద్యమం ఇప్పుడు భారత దేశంలో పెద్దఎత్తున్న కొనసాగుతుంది.  ఇప్పటికే బాలీవుడ్ పలువురు హీరోయిన్లు తమపై లైంగిక దాడులు జరిగాయని ఆరోపిస్తున్నారు.  ఇక దక్షిణాదిన సింగర్ చిన్మయి మీటూ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నారు.  సినిమా పరిశ్రమతో మొదలై మెల్లగా ఒక్కో రంగానికి పాకుతున్న మీటూ సెగల తాలుకు ప్రకంపనలు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. ఏది నిజమో ఏది అబద్దమో అర్థం కాని విచిత్రమైన పరిస్థితి నెలకొంది. తాజాగా మలయాళం నటుడు దిలీప్ విషయంలో ఒక మహిళా జర్నలిస్ట్ చేసిన ట్వీట్ కొత్త వివాదానికి దారి తీసింది. 

Image result for bhavana dilp

ఇటీవలే ఓ బిడ్డకు తండ్రైన దిలీప్ కు విషెస్ చెబుతూ భార్య భర్తలను పొగుడుతూ సదరు లేడీ జర్నలిస్టు ట్వీట్ చేసింది. కాగా, గత ఏడాది దిలీప్ మళియాళ నటి భావనపై లైంగిక వేధింపులకు ప్రేరేపించిన కేసులో జైలు శిక్ష అనుభవించి వచ్చారు.  ప్రస్తుతం ఆయనపై కొంత మంది మాలీవుడ్ నటులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి  కొన్ని బలమైన ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే ఇటీవలే అమ్మ సంఘానికి రాజీనామా చేసాడు. అయితే దిలీప్ ని మోహన్ లాల్ కాపాడే ప్రయత్నం చేసారని ఇప్పటికీ మీడియా టాక్ ఉంది. అలాంటి దిలీప్ కు ఒక మహిళ ఇలా ట్వీట్ చేయడం పట్ల మన హీరొయిన్లకు బాగా కోపం వచ్చింది.


  'మీటూ' ఉద్యమం ఊపందుకున్న వేళ, లైంగిక వేధింపుల కేసు నిందితుడికి శుభాకాంక్షలు చెప్పడం ఏంటని మంచు లక్ష్మి ప్రశ్నించింది. హీరోయిన్లు అందరూ ఆయనకు వ్యతిరేకంగా పోరాడుతుంటే, నువ్వు మద్దతుగా నిలవడం సిగ్గు పడాల్సిన విషయమని వ్యాఖ్యానించింది.  ఇక ఇదే విషయమై తాప్సి తన సోషల్ మీడియాలో స్పందిస్తూ, "మ‌హిళే మీటూ ఉద్య‌మానికి వ్య‌తిరేఖంగా ప్ర‌వ‌ర్తిసుంటే చాలా ఇబ్బందిక‌రంగా ఉంది" అని చెప్పింది.  

Image result for chinmai metoo

 "ఇటువంటి ట్వీట్ మీ నుంచి వచ్చిందంటే నమ్మాలని అనిపించడం లేదు. మార్పు మన నుంచే వచ్చిందన్న విషయం గుర్తు పెట్టుకోండి" అని రకుల్ స్పందించింది. దీంతో డిఫెన్స్ లో పడిన ఆ జర్నలిస్ట్ జస్ట్ స్నేహపూర్వకంగానే మెసేజ్ పెట్టాను తప్ప ఇంకే ఉద్దేశం లేదని సమర్ధించుకునే ప్రయత్నం చేసింది. నిజానికి ఆమె చేసింది ఒప్పు అనడానికి లేదు. మొత్తానికి మహిళా ఒక తాటిపైకి తీసుకొస్తున్న మీ టూ స్ఫూర్తి ఇలాగే కొనసాగాలని పరిశ్రమ పెద్దలు కోరుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: