టెలివిజన్ చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలం ప్రసారమైన క్రైమ్ సీరియల్ 'సీఐడీ' ముగియనుంది. భారత దేశ వ్యాప్తంగా ఎంతో ఆదరణకు నోచుకున్న ఈ క్రైమ్ సీరియల్ లో ఎన్నో సస్పెన్స్ థ్రిల్లర్ తో సాగిన ఎపిసోడ్స్ వచ్చాయి.  అంతే కాదు ‘సీఐడీ’లో దేశభక్తికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన ఎపిసోడ్స్ రావడంతో జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు కూడా కైవసం చేసుకుంది.  ఈ సిరియల్ లో సినీ నటులు సైతం నటించారు.   1997 నుంచి సోనీ టీవీలో ప్రసారమవుతూ వచ్చిన ఈ సీరియల్ ఈ నెల 29తో ముగియనుంది.
Image result for cid serial
సోమవారం నాడు సీరియల్ చివరి ఎపిసోడ్ ప్రసారమవుతుందని, నిర్మాతలు తెలిపారు. ఇప్పటివరకూ సీరియల్ 1,546 ఎపిసోడ్లు ప్రసారమైంది.  మొదట ఈ సిరియల్ హిందీలో ప్రసారం అయ్యింది..తర్వాత సీరియల్ కి బాగా డిమాండ్ పెరగడంతో వివిధ భాషల్లో అనువాదం అయ్యింది.  తెలుగు లో కూడా ఈ సీరియల్ ని ఇష్టపడేవారు ఎంతో మంది ఉన్నారు.  చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఎంతో ఉత్సాహంతో ఈ సీనియల్ చూసేవారు.  ఎందుకంలో ‘సీఐడి’లో కామెడీ తో పాటు..సొసైటీలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై కూడా ఎంతో అవగాహనతో చూపించే వారు.  కొన్ని క్లిష్టతరమైన క్రైమ్ ఎపిసోడ్స్ ఎలా సొల్యూషన్ చేశారనేది ‘సీఐడీ’లో అద్భుతంగా చూపించారు. 
Image result for cid serial
ఇందులో నటులు బాలీవుడ్ సినిమాల్లో నటించారు.  ఇక దీని ముగింపుపై ఇనస్పెక్టర్ దయా పాత్ర పోషించిన దయానంద్ షెట్టి స్పందిస్తూ, సీరియల్ విషయంలో అంతా బాగానే ఉందని, టీఆర్‌పీ రేటింగ్స్ కూడా సంతృప్తికరంగా ఉన్నాయని, ఇటీవల షూటింగ్ మధ్యలో నిర్మాత బీపీ సింగ్ వచ్చి, సీరియల్ ను ముగిస్తున్నట్లు చెప్పారని అన్నారు.  ఈ విషయం విని అక్కడ ఉన్నవారమంతా ఆశ్చర్యపోయామని..ఎంతో ప్రజాదరణ పొందిన ‘సీఐడీ’ముగించేస్తున్నారంటే..మాతో పాటు అభిమానులు కూడా ఎంతో నిరాశకు గురి అవుతారని అన్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: