చాలా కాలం తరువాత తెలుగు తెరకు ఓ ఓరిజినల్ నటుడు దొరికాడు. ఇంకా చెప్పా లంటే నాలుగు దశాబ్దాల తరువాత సొంత మ్యానరిజం తో అసలైన నటుడు వచ్చాడనుకోవాలి. అంటే ఇన్ని దశాబ్దాలుగా నటులే లేరా అన్న డౌట్ రావచ్చును. వారంతా గొప్ప నటులే. కానీ పాపం వారికే తెలియకుండా వారు ఇమిటేషన్ ప్రభావానికి లోను అయిపోయారు. అప్పటికి టాప్ స్టార్స్ అనబడ్డ వారిని అనుకరిస్తూ వారు తమ నటనలోని ఒరిజినాలిటీని మిస్ చేసుకున్నారు.


అందువల్ల ఆ నటుల్లో అసలు కంటే ఈ కొసరు అనుకరణలే ఎక్కువగా కనిపించి చూసే వారిలో ఎక్కడో ఎవరినో ఇంతకు ముందే ఇలాంటి హావభావాలతో చూశామనిపించేలా చేశారు. చిత్రమేంటంటే వారూ సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. కానీ వారిలోని అసలైన నటుడు మాత్రం అలాగే ఉండిపోయాడు.

 

ఇపుడు టాలీవుడ్ లో దూసుకు వచ్చిన యువ కెరటం విజయ్ దేవరకొండ అలా కాదు. అతనిలో ఎక్కడో ఎవరినో చూసిన ఫీలింగ్ అసలు కలగదు, తన నవ్వు, నడక, హావభావలు అన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి. అతని మాట తీరు కూడా గమ్మత్తుగా ఉంటోంది. అందుకే అతను అందరికీ నచ్చేశాడు. అలా ఇలా కాదు. పిచ్చ పిచ్చగా. ఇపుడు అతనే యువ హీరోల్లో హాట్ ఫావరేట్ గా ఉన్నాడు.

 

విజయ్ లోని నటుడిని చూసి మెగాస్టార్ చిరంజీవి మతాబు లాంటి కితాబు ఇచ్చేశారు. ఏకంగా స్టార్ క్లబ్ లోకి ఇన్వైట్ చేశారు. అలాగే ఆయన లేటెస్ట్ హిట్ మూవీ గీతా గోవిందం చూసిన వారంతా తెలుగు తెరకు మంచి హీరో లభించాడని ఓ రేంజిలో పొగుడుతున్నారు. విజయ్ అలాగే ఉండాలి. తనలాగే ఉండాలి. ఆ ఒరిజినాలిటీయే అతన్ని అందరిలో స్పేషల్ గా నిలబెట్టింది. అతనితో సినిమాలు చేసేందుకు స్టార్ ప్రొడ్యూసర్లు ఇపుడు క్యూ కడుతున్నారు. హిట్, ఫట్ లతో సంబంధం లేని క్రేజ్ ని ఇపుడే ఇలా విజయ్ సంపాదించుకున్నాడు.

 

చిరంజీవితో ఎన్నో హిట్ మూవీస్ తీసిన క్రియేటివ్ కమర్షియల్స నిర్మాత కేఎస్ రామారావు ఓ సినిమా తీస్తున్నారు. విజయదశమికి అది ఎందరో సినీ ప్రముఖుల చేతుల మీదుగా ప్రారంభం అయింది. ఇక నవంబర్ 16వ్ విజయ్ నటించిన టాక్సీ వాలా మూవీ వస్తోంది. నోటా తో డీలా పడినా విజయ్ కి మంచి ఫ్యూచర్ ఉందనడానికి ఎన్నో సినిమాలు రెడీగా ఉన్నాయి. మొత్తానికి జాగ్రత్తగా అడుగులు వేస్తే టాలీవుడ్ విజయ్  కి రెడ్ కార్పెట్ పరచి పది కాలాలు పదిలంగా చూసుకుంటుందని చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: