బాహుబలి తర్వాత రాజమౌళి చేయబోతున్న రాజెక్ట్ ట్రిపుల్ ఆర్ మీద రకరకాల వార్తలు వస్తున్నాయి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించబడుతుంది. చరణ్, ఎన్.టి.ఆర్ కలిసి చేస్తున్న ఈ మెగా మల్టీస్టారర్ సినిమా నవంబర్ 18 నుండి షూటింగ్ మొదలు పెడుతున్నారట.


ఈ సినిమా కోసం ఇప్పటికే వర్క్ షాప్ మొదలు పెట్టగా ముందు ఎన్.టి.ఆర్ తో షూటింగ్ మొదలు పెట్టబోతున్నారని తెలిసిందే. అయితే లేటెస్ట్ గా సినిమాలో ఎన్.టి.ఆర్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడని టాక్. రాజమౌళి సినిమాల్లో విలన్ చాలా ప్రత్యేకంగా ఉంటాడు. జై లవ కుశలో ఎన్.టి.ఆర్ నెగటివ్ రోల్ చూసి జక్కన్న ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది.


అయినా ఎన్.టి.ఆర్ విలన్ గా ఎందుకు ఒప్పుకుంటాడు అంటే.. రాజమౌళి విలన్ గా చూపిస్తున్నాడు అంటే తప్పకుండా అందులో ఏదో ఒక విశేషం ఉండే ఉంటుంది. అది కూడా ఎన్.టి.ఆర్ వల్లే అవుతుందని నమ్మే అంటున్నారు కొందరు. మరి ఈ వార్తల్లో ఏమాత్రం నిజం ఉందో త్వరలో తెలుస్తుంది. 


ప్రస్తుతానికి సినిమాకు సంబందించిన కాస్ట్ అండ్ క్రూ సెలెక్ట్ చేసుకునే పనిలో ఉన్న రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనులను చూస్తున్నాడు. ఇక సినిమా చేస్తున్నందుకు హీరోలకు రెమ్యునరేషన్ బదులుగా ఏకంగా బిజినెస్ లో షేర్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. నవంబర్ లో సెట్స్ మీదకు వెళ్తున్న ఈ సినిమా 2020 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: