మెగ పవర్ స్టార్ రాం చరణ్ మూవీ అంటే అది అన్ని ఉన్న నవరసభరిత‌మైన చిత్రంగా ఉండాలి. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న చెర్రీ , బోయపాటి మూవీకి వినయ విధేయ రామా అన్న టైటిల్ ఖరార్ చేశారు. సినిమా కూడా దాదాపుగా పూర్తి కావచ్చిందని  టాక్. సాంగ్స్ మాత్రం బ్యాలన్స్ ఉన్నాయని చెబుతున్నారు. అందులో ఓ మంచి మసాల సాంగ్ కి డైరెక్టర్ బోయపాటి ప్లాన్ చేశాడని టాక్.


ఈ సాంగ్ ఐటం నంబర్ గా మూవీలో వస్తుందట. దీన్ని తనదైన స్టైల్లో తీసేందుకు బోయపాటి ప్లాన్ చేస్తున్నారు. మరి ఐటెం సాంగ్ లో చెర్రీ పక్కన స్టెప్పులు వేసేది ఎవరన్నది చూస్తే క్రేజీ భామ కేధరిన్ థ్రేసా అని తెలుస్తోంది. సరైనోడు మూవీలో బన్నీతో సరి జోడీగా నటించి మురిపించిన కేధరిన్ ఇపుడు చరణ్ పక్కన ఆడి పాడబోతోందట. ఆ సినిమాకు కూడా బోయపాటి డైరెక్టర్ కావడం విశేషం. ఆ చనువుతో కేధరిన్ ని ఈ మసాలా ఐటం నంబర్  కోసం  అడుగుతున్నారని తెలుస్తోంది.


నిజానికి ఈ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటిని మొదట అనుకున్నారట. అయితే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో పాటు, సినిమా విడుదలకు టైం కూడా లేకపోవడంతో కేధరిన్ అయితే బెటర్ అని బోయపాటి ఫిక్స్ అయ్యారట. దాంతో చరణ్  పక్కన చిందులేసే చాన్స్ ఈ బ్యూటీకి దక్కుతోంది. కేధరిన్ ఈ మధ్యనే తన అందాలతో కిక్కెంకించే  ఫోజులు ఇస్తూ మీడియాకు రిలీజ్ చేసింది. తాను దేనికైనా రెడీ అంటున్న కేధరిన్ ని బోయపాటి తనదైన మార్క్ తో ఎలా వాడుకుంటాడో  చెర్రీ సినిమాలో చూసేయొచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: