హ‌లో గురూ ప్రేమ కోసమే మూవీలో డీసెంట్ హిట్ కొట్టిన హీరో రాం తన తరువాత ప్రాజెక్టులను కూడా పట్టల మీదకు తెస్తున్నాడు. తొందరలోనే మల్టీస్టారర్ మూవీలో యాక్ట్ చేస్తున్నట్లుగా రాం ప్రకటించాడు. ఆ మూవీలో రాం తో కలసి చేసే మరో హీరో ఎవరా అన్నది సస్పెన్స్ ట.


హలో గురూ ప్రేమ కోసమే సక్సెస్ మీట్ లో భాగంగా ఈ రోజు విశాఖపట్నం వచ్చిన చిత్ర యూనిట్ మీడియాతో విశేషాలు పంచుకొంది. ఈ సందర్భంగా రాం మాట్లాడుతూ ఈ మూవీని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్ష‌కులకు థాంక్స్ అన్నారు. . సినిమా చాలా భాగం విశాఖలోనే తీశామని రాం చెప్పారు. తనకు విశాఖ అందాలు అంటే ఎంతో ఇష్టమని కూడా చెప్పుకొచ్చాడు. రానున్న రోజుల్లో విశాఖ సినిమాలకు రాజధాని అవుతుందని కూడా రాం అన్నాడు.


సినిమా కలెక్షన్లు చాలా బాగున్నాయని, ఇప్పటికీ ఎక్కడా డ్రాప్ అవకుడా షోలు రన్ అవుతున్నాయని దర్శకుడు నక్కిన త్రినాధరావు చెప్పారు. విశాఖలో సినిమాలు తీయడానికి బాలీవుడ్ నుంచి కూడా నిర్మాతలు వస్తున్నారని, బ్యూటి ఫుల్ స్పాట్ అంటూ పొగిడేశారు. ఈ సినిమాలో నటించిన హీరోయిన్లు అనుపమ పరమేశ్వరన్, ప్రణీత ఇద్దరూ సూపర్ హిట్ మూవీ దొరికిందంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి వీకెండ్ లో విశాఖను హలో అంటూ యూనిట్ పలకరించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: