త్రివిక్రం పేరు ప్రస్థావించాలంటే వాడే రెండు మాటలు.. పంచులు కనిపెట్టిన వాడు.. మాటల మాంత్రికుడు.. అయితే ఇవే ఆ రైటర్ కం దర్శకుడిని ఇబ్బందుల్లో పెడుతున్నాయని ఇన్నాళ్లు తెలియదు. త్రివిక్రం డైరక్షన్ లో వచ్చిన అరవింద సమేత సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న త్రివిక్రం ఓ ఇంటర్వ్యూలో తన శత్రువుల గురించి చెప్పాడు.


త్రివిక్రం కు కూడా శత్రువులు ఉంటారా ఇంతకీ వాళ్లెవరు అంటే తన ముందు ఈ ట్యాగ్ లైన్ పెట్టిన వాళ్లే అంటున్నాడు త్రివిక్రం. ఎప్పుడో నువ్వే కావాలి టైంలోనే ప్రాసని వాడటం మానేశానని. అప్పటి నుండి ఆలోచనని మాటగా చెప్పడం ప్రారంభించానని అన్నారు. ఇక కొత్తగా వచ్చిన వారు ఆ పంచులు వేయడం మొదలు పెట్టారు. అందుకే తాను ఆపేశానని అన్నారు.


ఇక ఇప్పటికి తన సినిమాలో పంచులు కావాలని రాయనని స్పాటేనియస్ గా వస్తాయని అన్నారు త్రివిక్రం. తన పేరు ముందు ట్యాగ్ లైన్ ఎవడు కనిపెట్టాడో తెలియదు కాని అలా అంటే తనకి ఇష్టం లేదు అన్న మనసులోని విషయాన్ని వెళ్లడించారు త్రివిక్రం. అతను రాసే మాటలు మనసుకి తాకుతాయి కాబట్టే అతన్ని మాంత్రికుడు అనేస్తున్నారు.


అది ఒకవేళ అతనికి ఇష్టం లేకున్నా అభిమానులు పిలిచే పేరు అదే అని అడ్జెస్ట్ అవ్వాల్సిందే. అజ్ఞాతవాసి ఫ్లాప్ తో కాస్త వెనుక పడ్డట్టు అనిపించిన త్రివిక్రం ఎన్.టి.ఆర్ తో కొట్టిన హిట్ మళ్లీ ఆయనలో ఉత్సాహాన్ని పెంచింది. త్వరలోనే తన తర్వాత సినిమా గురించి వెళ్లడిస్తానని అన్నారు త్రివిక్రం.



మరింత సమాచారం తెలుసుకోండి: