ఒక హీరోకి అనుకున్న కథను మరో హీరో తీసి హిట్ కొట్టడం చాలా సందర్భాల్లో జరుగుతున్నదే. అయితే ఒక హీరో రిజెక్ట్ చేసిన కథను యాక్సెప్ట్ చేసిన్ అది కాస్త హిట్ కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి ఓ సినిమా ఒక హీరోతో అనుకోని అనివార్య కారణాల వల్ల అది క్యాన్సిల్ అవగా అదే కథతో వేరే హీరో సినిమా చేస్తున్నాడు.


టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ డైరక్టర్స్ లో చంద్రశేఖర్ యేలేటి ఒకరు. కమర్షియల్ గా సక్సెస్ అందుకోలేని ఆయన టెక్నికల్ గా మాత్రం చాలా విషయం ఉంటుందనిపిస్తుంది. రాజమౌళి ఏరా.. అని పిలిచేంత చనువు ఉన్నా సరే చంద్రశేఖర్ యేలేటి తన పంథాలో సినిమాలు చేస్తూ ఉంటాడు. ఇదిలాఉంటే యేలేటి వెంకటేష్ కోసం ఓ కథ రాయడం జరిగింది.  


వెంకటేష్ ఆ కథ వినడం సొంత బ్యానర్ లోనే ఆ సినిమా చేయాలనుకోవడం వార్తల్లో వచ్చాయి. అయితే సురేష్ బాబు మాత్రం సినిమా బడ్జెట్ విషయంలో వెనక్కి తగ్గారట. అందువల్ల ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. అలా క్యాన్సి. అయిన ఆ ప్రాజెక్ట్ యేలేటి శిష్యుడు రాధాకృష్ణ దగ్గరకువచ్చింది. ఆ కథనే కొద్దిగా మార్చి ఇప్పుడు ప్రభాస్ తో చేస్తున్నాడట జిల్ ఫేం రాధాకృష్ణ.


సాహో తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమా అదే అని తెలిసిందే. ఈమధ్యనే ఓపెనింగ్ చేసిన ఆ సినిమా ఓ పక్క షూటింగ్ కూడా జరుపుకుంటుంది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో హీరో ఆస్ట్రాలజీ నమ్మే వ్యక్తిగా కనిపిస్తాడట. మరి వెంకీ మిస్సైన ఈ కథతో ప్రభాస్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: