ఇప్పుడు ఎక్కడ చూసినా ‘మీ టూ ’ ఉద్యమం కొనసాగుతుంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ‘మీ టూ ’ ఉద్యమం ఓ రేంజ్ లో కొనసాగుతుంది.  బాలీవుడ్ నటీమణులు తనూశ్రీ దత్తా గత పది సంవత్సరాల క్రితం నటుడు నానా పటేకర్ తనపై లైంగికంగా దాడి చేశారని..అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది.  అంతే కాదు దర్శకుడు, కొరియోగ్రాఫర్ పైకూడా లైంగిక ఆరోపణలు చేసింది.  ఇక బాలీవుడ్ క్విన్ గా పేరు తెచ్చుకున్న కంగనా రౌనత్ సైతం తనపై లైంగిక దాడులు జరిగాయని..అది కూడా స్టార్ హోదాలో ఉన్నవారే అంటూ ఆరోపించింది.
Image result for mee too
అయితే వీరి ఆరోపణలకు సంఘీభావం పలికిన వారు కొంత మంది అయితే..విమర్శించిన వారు కొంతమంది ఉన్నారు.  ఇటు దక్షిణాదిన ‘మీ టూ ’ఉద్యమం బాగానే కొనసాగుతుంది.  గతంలో టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని నటి శ్రీరెడ్డి సంచలన ఉద్యమం తీసుకు వచ్చింది. ఇప్పుడు ‘మీ టూ ’ ఉద్యమం లో భాగంగా సింగర్ చిన్మయి వెలుగులోకి వచ్చింది.  గతంలో  తమిళ సినీ రచయిత వైరముత్తు తనను గదికి రమ్మన్నారంటూ గాయని చిన్మయి శ్రీపాద ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వైరముత్తుకు దర్శకుడు, నటుడు మరిముత్తు మద్దతుగా నిలిచారు. 
Image result for vairamuthu
ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఏదైనా బంగారం దుకాణంలో దొంగతనం చేస్తే సిగ్గుపడాలి తప్ప, ఓ మహిళను తన గదికి రమ్మనడాన్ని తప్పుబట్టడం ఎందుకని ప్రశ్నించారు. వైరముత్తు కూడా మనిషేనని, ఆయనకూ హార్మోన్లు ఉంటాయిగా అంటూ వ్యాఖ్యానించారు.  అయితే ఒక మహిళలతో గడపాలని ఆయన కోరిక ఉంటే..అడిగితే ఇష్టమైతే వెళ్తుంది..లేదంటే మీడియాకు ఎక్కుతుంది..ఇప్పడు జరిగింది అదే అని అన్నారు.  ఈ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాలు వేదికగా మరిముత్తుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: