సినిమా ప్రపంచంలో ఎన్నో సెంటిమెంట్లు ఉంటాయి. ఒక పైర్ హిట్ అయితే చాలు రిపీట్ చేస్తారు. ఒక మూవీ హిట్ అయితే ఆ స్టార్స్ దశ తిరిగినట్లే. వరసగా ఆఫర్లు ఇచ్చేస్తారు. మరి ఫ్లాప్ అయిందా ముఖం కూడా చూడరు. అలాంటి చోట సినిమాలు పోతున్నా ఆఫర్లు వస్తున్నాయి. మరి దీని వెనక సీక్రెట్ ఏంటో.


అనూ ఇమ్మాన్యుయేల్ తెలుగు జనాలకు తెలిసిన అందమే. ఈ ముద్దుగుమ్మ హాట్ భామ కూడా. యమ జోరైన రొమాంటిక్ ఫోజులతో కిర్రెక్కిస్తుంది. ఇక హిట్లు ఫట్లు చూడకుండా సినిమాలు అనుకు దొరికేస్తున్నాయి. ఈ మధ్యనే నాగ్ నట వారసుడు నాగ చైతన్యతో శైలజారెడ్డి అల్లుడు మూవీ చేసిన అనుతో కొత్తగా సినిమాలు తీసేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారట. ఈ న్యూస్ వింటే  షాక్ కానీ ఆమె హీరోయిన్ కావాలని కోరుతున్న హీరోలూ ఉన్నారట.


ఈ ఏడాది అనూ ఇమ్మాన్యుయేల్ కి బాడ్ అని చెప్పాలి. సంక్రాంతి పండుగకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి'లో అను హీరోయిన్. ఆ గోల్డెన్ చాన్స్ పట్టేసినా సినిమా ఫ్లాప్ కావడంతో అను డిసప్పాయింట్ అయిందట. ఇంతలో మెగా క్యాం నుంచే అల్లు అర్జున్ హీరోగా నా పేరు సూర్య మూవీలో కూడా అను హీరోయిన్ గా చేసింది. సమ్మర్ కి వచ్చిన  ఈ మూవీకి అంతగా ఆదరణ దక్కలేదు. శైలజారెడ్డి అల్లుడు సినిమా సైతం హిట్ అనిపించుకోలేదు. అలా 2018 చేదు అనుభవమే రుచి చూపింది. 


ఇంత జరిగినా అనూ ఇమ్మాన్యుయేల్ కి ఆఫర్లు వెల్లువలా వస్తున్నయి. సీక్రెట్ ఎంటి అంటే ఆమె స్కిన్ షో బాగా చేస్తుందట. మరి మిగతా వాళ్ళు కూడా చేస్తారు కదా అంటే అనూ ఇమ్మాన్యుయేల్ హాట్ పోజులు కిక్కెక్కిస్తాయట. మరి అందువల్లనే ఈ ముద్దు గుమ్మ కావాలని కోరుతున్నారంటున్నారు. దీనిపై అనూ ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ తన పాత్రలు కూడా బాగుంటున్నాయి,  అందుకే హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా తనకు చాన్సులు వస్తున్నాయని అంటోంది. ఎంతైనా ఈ ముద్దు గుమ్మ తెలివైనదే. 


మరింత సమాచారం తెలుసుకోండి: