ఆమె హాట్ బ్యూటీ, అందాలన్నీ పరచేసి యువ హ్రుదయాలను దొలిచేయడంలో స్పెషలిస్ట్. అప్పట్లో టాలీవుడ్లోనూ ఓ రేంజిల సత్తా చాటింది. తరువాత వ్యకిగత వివాదాలు ఇతరత్రా కారణాల వల్లా ఆమె కొంత తగ్గినా మళ్ళీ రైజింగ్ స్టార్ నేనే అంటోంది. ఈ మధ్యన సరైన సినిమాలతో జనం ముందుకు వస్తున్న ఆమె కోలీవుడ్ తో పాటు తెలుగు లోనూ ప్రూవ్ చేసుకుంటానని అంటోంది.


ప్రస్తుతం తమిళ్, హిందీ మూవీస్ ఎక్కువగా చేస్తున్న ముద్దుగుమ్మ అమలాపాల్ పాత తప్పులు మళ్ళీ చేయనని అంటోంది. అప్పట్లో తాను తొందరపడి మంచి క్రేజ్ లో ఉండగానే ప్రేమ వివాహాం చేసుకున్నానని, అది బెడిసికొట్టదమే కాకుండా కెరీర్ నే ఇబ్బందుల్లోకి నెట్టిందని బాధ పడుతోంది. విడాకులు తీసుకున్న తరువాత తిరిగి మూవీస్ చేస్తున్న ఆ అమ్మడు మళ్ళీ పెళ్ళికి రెడీ అంటోంది. అయితే ఈ సారి మాత్రం బుద్ధిగా పెద్దవాళ్ళు చెప్పినట్లుగానే నడచుకుంటానని అంటోంది.


మా అమ్మా నాన్న చెప్పిన వారినే పెళ్ళి చేసుకుంటానని చెబుతున్న అమలాపాల్ రానున్న రోజుల్లో మళ్ళీ తాను టాలివుడ్లోనూ విజ్రుంభిస్తానని చెబుతూంది. అప్పట్లో తెలుగులో ఆ సీనియర్ స్టార్ హీరో పక్కన నటించాలని అమలాపాల్ ని కోరితే రిజెక్ట్ చేసింది. తాను ఇంకా చిన్నదానినని పెద్ద వయసు హీరోలతొ నటిస్తే ఇంక కెరీర్ అలాగే ఆగిపోతుందని భావించిందట. ఇపుడు తెలుగులో కుర్ర హీరోలు ఆమెతో నటించేందుకు మళ్ళీ రెడీ అంటారా లేదా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: