స్టార్ డం ఉంటే చాలదు, అంతకు మించిన వినయం కూడా ఉండాలి. ఎంత ఎదిగినా ఒదిగే గుణమూ ఉండాలి. అది అందరికీ సాధ్యం కాదు. ఒక స్థాయికి వచ్చాక తామే సర్వస్వం అనుకుంటారు. తమ హవా చూసుకుని కళ్ళు నెత్తి మీద పెట్టుకుంటారు. కానీ అప్పటికీ, ఎప్పటికీ డౌన్ టు ఎర్త్ అంటే రజనీకాంత్ అని చెప్పాలి. ఆయనను చూసి నేటి తరాల హీరోలు స్పూర్తి పొందాలి.


ఈ రోజు విడుదలై  సంచలనం స్రుష్టిస్తున్న  2.ఓ ట్రైలర్‌ సందర్భంగా రజనీకాంత్ చిత్ర దర్శకుడిపై కొన్ని ఇంటెరెస్టింగ్ కామెంట్స్ చేశారు. నిజానికి ఈ సినిమా హీరో నేను కాదు శంకర్ అంటూ ఉన్న మాట కూడా ఇదేనని మనసు విప్పి చెప్పేశారు. ఈ సినిమ మొదలు పెట్టిన తరువాత నేను చేయలేననుకున్నాను, కానీ శంకర్ ఇచ్చిన సపోర్ట్ మరువలేనిది. మీరే చేయాలంటూ చెప్పి చేయించుకున్నాడని రజని అన్నారు.


ఇక సినిమా కోసం దాదాపుగా 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటే నన్ను చూసి, నా ముఖం చూసి కాదంటూ రజని చేసిన వ్యాఖ్యలు సంచలనమే. శంకర్ మీద నమ్మకమే ఈ సినిమా అంటూ రజని నిజాయతీగా చెప్పేశారు. ఈ సినిమా తరువాత శంకర్ అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంటాడని రజనీ చెప్పుకొచ్చారు.


 శంకర్, రాజమౌళి, రాజ్ కుమార్ హిర్వాణీ వంటి వారు ఈ దేశం వజ్రాలు అంటూ రజనీ అన్నారంటే ప్రతిభను మెచ్చుకోవడంలో, ఉన్నది బయటకు చెప్పడంలో ఆయన గొప్పతనం ఏంటన్నది మరో మారు లోకానికి తెలిసింది. అందుకే ఆయన సూపర్ స్టార్ అయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: