మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో వరుణ్ తేజ్, అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలలో సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్న సినిమా అంతరిక్షం. డిసెంబర్ 21న విడుదల కానున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.అంతరిక్ష నేపధ్యంలో సాగే ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై  సినిమాపై అంచనాలను పెంచేసింది. లావణ్య త్రిపాఠి, అదితిరావు హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు నిర్మిస్తున్నారు. 

Antariksham team wishes happy diwali

హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పని చేస్తుండగా, విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రంలో ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్, అదితిరావు వ్యోమగాములుగా కనిపించనున్నారు. దసరా కానుకగా చిత్ర టీజర్ విడుదల కాగా, ఈ టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. దీపావ‌ళి సంద‌ర్భంగా సినిమా  నుండి పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఈ పోస్టర్ లో వరుణ్ తేజ్,  లావణ్య త్రిపాఠి సంప్రదాయ గెటప్ లో దర్శనమిచ్చారు.వరుణ్ తేజ్ వైట్ అండ్ వైట్ కుర్తా పైజామాలో హుందాగా కనిపిస్తే.. లావణ్య లంగావోణీలో అందంగా కనిపిస్తోంది.

Image result for అంతరిక్షం

ఈ సినిమాను డిసంబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.  గౌతమీపుత్ర శాతకర్ణి తో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొన్న ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాని  నిర్మిస్తుంది. ఘాజీ చిత్రంలానే ఈ సినిమా భారీ హిట్ అవుతుందని టీం భావిస్తుంది. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందిస్తున్నారు. వి.ఎస్. జ్ఞానశేఖర్ ఛాయా గ్రాహకుడు.



మరింత సమాచారం తెలుసుకోండి: