వెండి తెర పై అందాల తారలను చూసేవారికి ఎంతో హాయిగా ఉంటుంది కానీ షూటింగ్ చేసే వారికి మాత్రం పని వత్తిడి ఓ రేంజిలో ఉంటుంది. షూటింగ్ స్పాట్ లో తారలు ఎంతటి బిజీగా ఉంటారంటే మానసికంగా, శారీరకంగా బాగా  అలసిపోతారు. ఆ టైంలో వారిని కనుక చూస్తే సినిమా ప్రపంచమంటే  ఇదేనా అనిపిస్తుంది. భారీ లైట్లు, హంగామ షాట్, కట్, అంటూ అరుపుల మధ్యన నటన అంటే ఓ విధంగా కత్తి మీద సామే.


మరి అటువంటి టైంలో స్ట్రెస్ రిలీఫ్ కావాలను తారలు కోరుకుంటారు. కొంతమంది  షాట్ గ్యాప్ లో బుక్స్ చదువుతూ రిలీఫ్ ఫీల్ అయితే మరికొంతమంది బాతాఖానీ వేస్తూ వత్తిడి నుంచి తప్పించుకుంటారు. కొంతమంది ఫొన్లకు పని చెబితే మరికొంతమంది స్మార్ట్ ఫోన్ల మీద పడతారు. మరి అందాల తమన్నా ఏంచేస్తుదంటే  ఆ విషయం  చెబితే వింతే మరి. షాట్ గ్యాప్ లో తన రూంలోకి వెళ్ళి హాపీగా ఓ కప్ కాఫీ లాగించేస్తుందట. అలా ప్రశాంతంగా కాఫీ సిప్ చేసిన తరువాత మళ్ళీ షాట్ రెడీయా అంటూ ఫుల్ ఎన‌ర్జీతో షూటింగ్ స్పాట్ లోకి వస్తుందట.


తమన్నా ఈ అలవాటును తెలుసుకున్న నిర్మాతలు ఆమె షూటింగ్ ఉందంటే చాలు పక్కన ప్రత్యేకంగా ఓ కాఫీ మిషన్ ని రెడీ చేసి పెడతారట. అలా తమన్నా  గ్యాప్ లో వెళ్ళి కాఫీ ఊదేస్తూ  బయటకు జోష్ తో వస్తుందట. అమ్రుతం తాగిన దేవ కన్యలా తమన్నా  కాఫీ తాగితే చాలు సోయగాల సిరిమల్లె అయిపోతుందట. ఇక ఎంత సేపు ఎటువంటి రిస్కీ సీన్లు తీసినా ఒకే నేను రెడీ అంటుందట. 


తమన్నా  టాప్ సీక్రెట్ ఇది కాబట్టే ఆమె వెండి తెర మీద ఖ‌తర్నాక్ పెర్ఫార్మెన్స్ ఇస్తోందని ఫ్యాన్స్ అంటున్నారు. కాఫీలో అంత బలముందా అని మాత్రం అడగొద్దు, అది తమన్నాకు మాత్రమే ఎనర్జీ ఇచ్చే హాట్ డ్రింక్ మరి. ఒక్కొక్కరికి ఒక్కోలా  అన్నీ అనిపిస్తాయి, కనిపిస్తాయి. మరి తమన్నాను  కూడా అలాగే కాఫీ లవర్ అనుకోవాలి అంతే.



మరింత సమాచారం తెలుసుకోండి: