ఆమె చేసింది రెండు సినిమాలే కానీ ఇపుడు మెగా క్యాంప్ లోకి సులువుగా వెళ్ళిపోయింది. లేటెస్ట్ బ్యూటీగా టాలీవుడ్ లో మెరిసిన ఈ చిన్నది రేపటి టాప్ హీరోయిన్ అయ్యే సూఛనలు బాగానే  కనిపిస్తున్నాయి.  ఆమె చేసిన తాజా చిత్రం సవ్యసాచిలో తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. నాగ చైతన్యతో జోడీ కట్టిన ఈ ముద్దు గుమ్మ ఇపుడు తమ్ముడు అఖిల్ పక్కన కూదా మిస్టర్ మజ్ఞూలో నటిస్తోంది.


ఈ రెండు మూవీల సంగతి ఇలా ఉంటే ఆమెకు ఇపుడు ఏకంగా మెగా క్యాంప్ నుంచి పిలుపు వచ్చినట్లుగా టాక్. మెగా వారసుడిగా త్వరలో మరో కొత్త ఫేస్ టాలీవుడ్ తెరపైకి వస్తోది. చిరంజీవి రెండవ మేనల్లుడు, సాయి ధర్మ రేజ్ తమ్ముడు అయిన సాయి వేష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా సెలెక్ట్ అయిందట. ఈ మూవీ ద్వారా ఆమె మెగా గుమ్మం ఎక్కేసిందంటున్నారు.


ఒకసారి మెగా క్యాంప్ లోకి ప్రవేశిస్తే ఏ హీరోయిన్ అయినా కనీసం నాలుగైదు మూవీస్ చేసే లక్కీ చాన్స్ అలా తన్నుకు వస్తుంది. అక్కడ దాదాపుగా పది మంది వరకూ హీరోలు ఉన్నారు. సో నిధి ఇపుడు బూర్ల గంపలో పడిందని మిగిలిన హీరోయిన్లు కుళ్ళుకుంటున్నారు. మొత్తానికి సినిమాలు హిట్లు, ఫట్లతో సంబంధం లేకుండా నిధి చాలా స్పీడ్ గానే టాలీవుడ్ నాడి పట్టేసిందని అంటున్నారు. ఆమె జోరు చూస్తుంటే  స్టార్ స్టాటస్ తొందరలోనే తెచ్చుకుంటుందని కూడా చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: