నందమూరి అందగాడు బాలయ్య తండ్రికి తగ్గ తనయుడు. ఎన్టీఆర్ వేసిన అనేక పాత్రలను తిరిగి ఈ నాటి తరానికి పరిచయం చేసిన ఘనత కచ్చితంగా బాలయ్యదే. పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం సినిమాల్లో తండ్రి వేసిన పాత్రలు మళ్ళీ బాలయ్య ధరించి మెప్పించిన సంగతి విధితమే. ఇపుడు అలాంటి అజరామరమైన మరో పాత్రలో బాలయ్య కనిపించి తెలుగు ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారని టాక్.


ఎన్టీఆర్ బయోపిక్ లో బాలయ్య ప్రస్తుతం నటిస్తున్నారు. ఈ మూవీలో బాలయ్య దాదాపు అరవై  గెటప్పులలో కనిపించి ఎన్టీఆర్  ని గుర్తుకుతెస్తారు. అందులో అతి ముఖ్యమైన పాత్ర బొబ్బిలి పులిలో ఎన్టీఆర్  వేసినది. ఆ చిత్రం తరువాత అన్న గారు రాజకీయాలపైన ఆసక్తిని పెంచుకుని తెలుగుదేశం పార్టీని స్థాపించిన సంగతి విధితమే.


 ఎన్నో గంభీరమైన సన్నివేశాలు, బరువైన డైలాగులతో ఉన్న ఆ చిత్రాన్ని మళ్ళీ గుర్తు చేసేందుకు ఎన్టీఆర్ బయోపిక్ టీం రెడీ ఔతోందట. కోర్టు హాల్లో ఎన్టీఆర్  చెప్పే డైలాగులు ఆ రోజుల్లో క్యాసెట్ల ద్వారా విని  అభిమానులు ఎంతో పరవశించేవారు. ఆ డైలాగులను ఇపుడు మళ్ళీ  బాలయ్య నోట పలికితే దర్శకుడు క్రిష్ దాన్ని ఎంతో అద్భుతంగా సింగిల్ టేక్ లో షూట్ చేశారట. 


ఇక ఈ సినిమాలో ప్రముఖ కవి డాక్టర్  సి  నారాయణ రెడ్డి పాత్రలో ఇప్పటి తరం రచయిత రామజోగయ్య శాస్త్రి కనిపించబోతున్నారుట. ఎన్టీఆర్  చిత్రం గులేబకావళి కధ ద్వారా సినారే తెలుగు తెరకు గేయ రచయితగా పరిచయం అయ్యారు. ఈ ఇద్దరి మధ్యన ఉన్న చక్కని అనుబంధాన్ని దర్శకుడు క్రిష్ ఈ మూవీలో మరో మారు చూపించబోతున్నారట. ఇలా అనేక హంగులతో కూడిన అన్నగారి బయోపిక్  ఆడియన్స్ లో ఆసక్తిని బాగా పెంచేస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: