నాగ చైతన్య కెరియర్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా సవ్యసాచి. చందు మొండేటి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా బాలీవుడ్ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. నవంబర్ 2న రిలీజైన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. 


అయితే ఆశించినంతగా ప్రేక్షకులను అలరించడంలో ఫెయిల్ అయిన సవ్యసాచి మూవీ వారం రోజుల్లో 8.97 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 23 కోట్ల దాకా జరిగింది. అంటే ఇప్పటిదాకా రాబట్టింది 9 కోట్లు కాగా ఇంకా 14 కోట్లు లాస్ లోనే ఉందన్నమాట. ప్రయోగాత్మక సినిమాగా వచ్చిన ఈ సవ్యసాచి ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.


కార్తికేయ, ప్రేమం సినిమాలను డైరెక్ట్ చేసిన చందు మొండేటి సవ్యసాచి అని టైటిల్ పెట్టి సినిమాపై ముందునుండి అంచనాలు పెంచగా రిలీజ్ తర్వాత ఆ అంచనాలను అందుకోలేకపోయాడు. ఇక ఏరియాల వారిగా సవ్యసాచి వారం రోజుల వసూళ్లు ఎలా ఉన్నాయో చూస్తే..


నైజాం : 2.35 కోట్లు
సీడెడ్ : 1.20 కోట్లు
వైజాగ్ : 1.03 కోట్లు
ఈస్ట్ : 0.41 కోట్లు
వెస్ట్ : 0.39 కోట్లు
కృష్ణా : 0.60 కోట్లు
గుంటూరు : 0.75 కోట్లు
నెల్లూరు : 0.34 కోట్లు
ఏపి/తెలంగాణ : 7.07 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 0.80 కోట్లు
రెస్ట్ ఆఫ్ వరల్డ్ : 1.10 కోట్లు
వరల్డ్ వైడ్ : 8.97 కోట్లు  


మరింత సమాచారం తెలుసుకోండి: