రంగస్థలం సినిమా తో భారీ హిట్ కొట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వెంటనే మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టేశారు. ఈ క్రమంలో గత కొంతకాలంగా సినిమా షూటింగ్ సాగుతున్నారని సినిమా యొక్క టైటిల్ చెప్పకుండా సస్పెన్స్ లో పెట్టిన పోయే పార్టీ ఇటీవల దీపావళి కానుకగా సినిమా టైటిల్ ప్రకటించడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

Image result for chery boyapati

దీపావళి కానుకగా ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ‘వినయ విధేయ రామా’ అని టైటిల్ రివీల్ చేసి సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ కూడా విడుదల చేయడంతో మెగాభిమానులు నిజమైన దీపావళి చేసుకున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా వైజాగ్ లో జరుపుకుంటుంది. సినిమాలో పక్కా మాస్ పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు.

Related image

పాటల చిత్రీకరణ పూర్తైన తర్వాత డిసెంబర్ నెలాఖరులో  ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం వైజాగ్ లో బారి ఎత్తున ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం, రామ్ చరణ్ గత చిత్రం 'రంగస్థలం' కూడా వైజాగ్ ప్రీ- రిలీజ్ ఫంక్షన్ జరుపుకొని బారి హిట్ గా నిలిచింది.

Image result for vinaya vidheya rama

ఇపుడు అదే సెంటిమెంట్ తో ‘వినయ విధేయ రామ’ ఆడియో రిలీజ్ కూడా సాగర తీరాన జరిపేందుకు రామ్ చరణ్ ఆసక్తి కనబరుస్తున్నారట. ఇదే క్రమంలో ఇటీవల విడుదలైన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో సినిమా యూనిట్ ఆనందంలో మునిగిపోయినట్లు సమాచారం. మొత్తంమీద టీజర్ చూసిన మెగా అభిమానులు వరుసగా రెండోసారి చెర్రీ భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: