మెగాస్టార్ చిరంజీవి క్లాప్ తో దర్శక ధీరుడు రాజమౌళి లేటేస్ట్ సెన్సేషన్ ఆర్ ఆర్ ఆర్ మూవీ ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. దేవుడు పటాలకు మెగస్టార్ క్లాప్ కొట్టడంతో లాంచనంగా ఈ మూవీ స్టార్ట్ చేశారు. 11వ నెల 11 గంటల 11 నిముషాలకు ప్రారంభించడం కూడా గమ్మత్తైన ముహూర్తమే. ఈ మూవీలో జూనియర్ నందమూరి, జూనియర్ కొణెదెల కలసి నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే బాహుబలి తరువాత రాజమౌళి మళ్ళీ చాలా కాలానికి మెగా ఫోన్ పట్టారు.


ఇక మరో ముఖ్య అతిధిగా గా బాహుబలి నాయకుడు ప్రభాస్ కూడా ఈ ఓఅపినింగుకు రావడం కొత్త కళను తెచ్చింది. ఎన్నో ఆశలతో వస్తున్న ఈ రేర్ కాంబో రెగులర్ షూటింగ్ ఎపుడు ప్రారభిస్తారో తెలియదు కానీ మూవీ మాత్రం 2020 లోనే ప్రేక్షకులు చూసేందుకు అవకాశం ఉంది. దాదాపు ఏడాదికి పైగా షూటింగ్ జరుకుకఒనున్న ఈ సినిమా కోసం అటు జూనియర్ ఎంటీయార్, ఇటు చెర్రీ కూడా ఫుల్ డేట్స్ ఇచ్చేశారు.


ఈ మూవీని ప్రారంభ   కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి సహా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, దర్శకులు కొరటాల శివ, వి.వి.వినాయక్, యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, దగ్గుబాటి రానా, నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి వంటి తెలుగు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు చేతుల మీదుగా రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్‌, నిర్మాత దానయ్యకు సినిమా స్క్రిప్టును అందజేశారు. వీరిపై అక్షింతలు వేసి ఆశీర్వదించారు. చిరంజీవి తొలి క్లాప్‌ను ఇచ్చారు. 


 డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగులో నిర్మితమవుతోన్న ఈ సినిమాను దేశంలోని అన్ని భాషల్లోకి అనువాదం చేయనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: