మోహ‌న్ లాల్ న‌టించిన మలయాళ సినిమా ‘వెల‌ప‌డింతె పుస్తకం’లోని జిమ్మిక్కి క‌మ్మల్ పాట కేరళాను షేక్ చేసిన విషయం తెలసిందే.  ఈ సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించింది.  ఈ పాటకు అనుగూణంగా రక రకాలు స్టెప్పులతో అలరించారు ఔత్సాహికులు.  పలువురు సెలబ్రిటీలు, కాలేజీ విద్యార్థినులు ఈ పాటకు డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా...వాటికి కూడా విపరీతమైన ఆదరణ లభించింది. ఓ రకంగా కొలవెరీ సాంగ్ కంటే ఎక్కువ పాపులారిటీని ఈ పాట సొంతం చేసుకుంది.   


ఈ పాటను వింటే ఎవరికైనా స్టెప్స్ వేయాలన్న ఉత్సాహం వస్తుంది. అమెరికన్ టెలివిజన్‌లో ప్రముఖ హోస్ట్ జిమ్మి కిమెల్‌కు కూడా జిమ్మిక్కి కమ్మల్ సాంగ్ బాగా నచ్చేసిందని కితాబిచ్చాడు. సినిమాలోని పాట క‌న్నా..జిమ్మిక్కి క‌మ్మల్ పాటకు కేర‌ళ విద్యార్థినులు వేసిన డ్యాన్స్ వీడియో యూట్యూబ్‌లో మోస్ట్ ట్రెండింగ్‌లో రెండో స్థానంలో నిలిచింది. ఈ వీడియోను యూట్యూబ్‌లో 2.30 కోట్ల సార్లు వీక్షించారు.   బాలీవుడ్‌ హిట్‌ సినిమా ‘తుమ్హారి సులు’ను తమిళంలో ‘కాట్రిన్‌ మోళి’ టైటిల్‌తో రీమేక్‌ చేస్తున్నారు. 


జ్యోతిక ఇందులో విద్యాబాలన్‌ పాత్రలో కనిపించనున్నారు. నేహా ధూపియా పాత్రలో మంచు లక్ష్మి నటిస్తున్నారు. బోఫ్టా మీడియా వర్క్స్‌ పతాకంపై ధనుంజయన్‌ నిర్మిస్తున్నారు. జ్యోతిక భర్తగా విదార్థ్‌ నటిస్తున్నారు.  తాజాగా  ఈ సినిమాలో ‘జిమ్మికి కమ్మల్ సాంగ్ ’పై జ్యోతిక, మంచు లక్ష్మి తమ స్టెప్పులతో ఆకట్టుకుంటున్నారు.  అయితే ఈ పాటలో మంచు లక్ష్మి, విదార్థ్ సంతోషంగా స్టెప్పులు వేస్తుంటే..జ్యోతిక మాత్రం చాలా విషాదంగా కనిపిస్తుంది. 


మంచు లక్ష్మి తనతో డ్యాన్స్ చేయించడం మోహమాట పడుతూనే జ్యోతిక డ్యాన్స్ చేయడం ఈ పాటలో చూపించారు.  'కాట్రిన్ మొలి' సినిమాలో జ్యోతిక, మంచు లక్ష్మీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ  సినిమా నవంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: