ఇది నిజమా అంటే అవుననే సమాధానం వస్తోంది. నిజానికి బాలయ్య తన పద్నాలుగవ ఏటనే చిత్ర రంగ ప్రవేశం చేశారు. తాతమ్మ కల నుంచి ఆయన పాత్రకు ఆయనే డబ్బింగ్ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పటికి వందకు పైగా సినిమాలు చేసిన బాలయ్య తన పాత్రకు వేరొకరు డబ్బింగ్ చెప్పడాన్ని అసలు అంగీకరించరు. అది జరిగే విషయం కూడా కాదు, పైగా అభిమానులు కూడా అంగీకరించరు. అటువంటి బాలయ్యకు సొంత గొంతు ఉండగా వేరే వాయిస్ వినిపించడమా. కానీ ఇక్కడ మాత్రం జరుగుతోంది మరి.


ఎన్టీఆర్ బయోపిక్ లో బాలయ్య తన తండ్రి పాత్రను పోషిస్తున్న సంగతి విధితమే. ఈ మూవీలో ఎన్నో చిత్ర విచిత్రాలు జరిగిపోతున్నాయి. అందులో భాగంగానే అన్న నందమూరి పాత్రను బాలయ్య పోషిస్తుంటే కొన్ని కీలక సన్నివేశాల్లో మాత్రం అన్న గారి వాయిస్ బాలయ్య పాత్రకు డబ్బింగ్ చెబుతుందంట. బొబ్బిలి పులి కోటు సీన్ తో పాటు, దానవీర శూర కర్ణలోని ఏమంటివి ఏమంటివి అన్న సూపర్ లెంగ్తీ డైలాగ్స్ వంటివి అన్న గారి పాత వాయిస్ ని యధాతథంగా ఉపయోగించడానికి దర్శకుడు క్రిష్ ప్లాన్ చేస్తున్నరట.


దీనికి బాలయ్య కూడా అంగీకరిచారని బోగట్టా. అదే జరిగితే నందమూరి ఫ్యాన్స్ కి డబుల్ డమాఖాయే మరి. ఇక సినిమాలో మిగిలిన పార్టులో మాత్రం బాలయ్య సొంత గొంతు చాలా చోట్ల వినిపిస్తునది. మొత్తానికి తారకరామున్ని  డిటోగా దించేయడానికి క్రిష్ టీం గట్టిగానే క్రుషి చేస్తోందన్న మాట.



మరింత సమాచారం తెలుసుకోండి: