బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్న నటుడు అమీర్ ఖాన్ తన ప్రతి సినిమా ఒక ప్రయోగంలా చేస్తుంటారు.   ఇండస్ట్రీలో మొదటి నుంచి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అమీర్ ఖాన్ తాను నటించబోయే సినిమాలో పాత్రలపై పూర్తి అవగాహన తెచ్చుకున్న తర్వాత ఆ క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేశాడా అన్నంతగా నటించి మెప్పిస్తాడు.  ఆ మద్య అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమాలో పాత్రకు అనుగూణంగా లావుగా పొట్ట పెంచుకున్నాడు. అదే సినిమాలో సిక్స్ ప్యాక్ తో కనిపించాడు.  ఇక బాలీవుడ్ లో అమీర్ ఖాన్ మరో భారీ హిట్ సినిమా పీకే.  

Image result for amir khan pk movie

ఈ సినిమాలో రక రకాల వేషాల్లో కనిపిస్తూ అందరినీ కడుపుబ్బా నవ్వించడమే కాదు సెంటిమెంట్ కూడా బాగా పండించాడు. ఇన్ని విజయాలు నమోదు చేసుకున్న అమీర్ ఖాన్ నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’భారీ డిజాస్టర్ అయ్యింది.  ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ కూడా నటించారు.  దాంతో ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఒకానోక దశలో  థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమా ‘బాహుబలి2’ని మించిపోతుందని టాక్ వచ్చింది.  

Image result for aamir khan dangal movie

కానీ థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత రివ్యూలన్నీ చాలా బ్యాడ్ గా వచ్చాయి. ఊహించని విధంగా డివైడ్ టాక్ రావడంతో రెండవరోజు నుంచి కలెక్షన్స్ డౌన్ అయ్యాయి. మొదటి రోజు 50కోట్లను అందుకోవడం తప్పితే తరువాత రోజు నుంచి తగ్గుతూ రావడం అందరిని షాక్ కి గురి చేశాయి.  అమిర్ ఖాన్ గత ఐదేళ్ళలో ఎప్పుడు అందుకొని విధంగా..  సినిమా రిలీజైన మొదటి అయిదు రోజుల అనంతరం అతి తక్కువగా 7 కోట్ల ను మాత్రమే రాబట్టగలిగాడు.  


మొత్తానికి అతి కష్టం మీద ఐదో రోజుకి  థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ 130కోట్లను అందుకుంది. ఈ సినిమా అసలు బడ్జెట్ 200కోట్లు.  కాకపోతే ఈ సినిమా నిర్మాత సేఫ్ లో పడ్డా..బయ్యర్స్ మాత్రం చాలా నష్టాలను చూసినట్లు చెప్పవచ్చు.  బాలీవుడ్ లో  దంగల్ సినిమాతో 2000 కోట్ల మార్కెట్ ఉన్న హీరోగా  చరిత్ర సృష్టించిన అమీర్  ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ ఘోర పరాభవం పొందాడని బాలీవుడ్ ఫిలిమ్ వర్గాలు అంటున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: