అసలే అరవింద సమేత మీద మహేష్ రెస్పాండ్ అవకుండా తమిళ సినిమా సర్కార్ సినిమాపై మహేష్ ట్వీట్ చేశాడని నందమూరి ఫ్యాన్స్ కోపంగా ఉండగా ఇప్పుడు మరోసారి నందమూరి ఫ్యాన్స్ కు మహేష్ బలవుతున్నాడు. ఇప్పుడు ఏకంగా బాలకృష్ణ మహేష్ మీద సీరియస్ గా ఉన్నాడని తెలుస్తుంది. 


ఎన్.టి.ఆర్ బయోపిక్ గా వస్తున్న సినిమాలో బాలకృష్ణ లీడ్ రోల్ చేస్తుండగా సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో మహేష్ నటించాల్సిందిగా కోరాడట బాలయ్య. అయితే మహేష్ మాత్రం అందుకు ఎస్ అని కాని నో అని చెప్పలేదట. క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు పార్టులు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.


మహేష్ ఇప్పటికి తన నిర్ణయం చెప్పకపోవడంతో సినిమాలో కృష్ణ పాత్రని కూడా కట్ చేశారని తెలుస్తుంది. అంతేకాదు ఈ చేయనని చెప్పేదేదో ముందే చెబితే బాగుండేదని బాలకృష్ణ ఫైర్ అవుతున్నాడట. మొత్తానికి మరోసారి నందమూరి ఘట్టమనేని ఫ్యాన్స్ మధ్య రచ్చ మొదలైంది. అరవింద సమేత విషయంలో ఓపెన్ కాకుండా ఎన్.టి.ఆర్ కు పర్సనల్ గా మహేష్ ఫోన్ చేసి ఉండొచ్చు.


అది నందమూరి ఫ్యాన్స్ తెలిసుండకపోవచ్చు అని ఘట్టమనేని ఫ్యాన్స్ సమర్ధించుకుంటున్నారు. ఎన్.టి.ఆర్ బయోపిక్ లో మహేష్ ఉన్నాడా లేడా అన్నది కూడా ఇంకా అఫిషియల్ న్యూస్ ఏది రాలేదు. మహేష్ మహర్షి సినిమా నుండి కూడా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. దసరా, దీవాళి పండుగలకు ఎలాంటి గిఫ్టులు ఇవ్వలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: