బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. ఈమధ్యనే ముహుర్తం పెట్టుకున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్, చరణ్ కలిసి నటించబోతున్నారని తెలిసిందే. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై నేషనల్ వైడ్ గా క్రేజ్ ఏర్పడింది. ఈ నెల 19 నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్తున్న ట్రిపుల్ ఆర్ కోసం రాజమౌళి పర్ఫెక్ట్ ప్లానింగ్ లో ఉన్నాడట.


సినిమాలో ఇద్దరు హీరోలు.. అది కూడా ఇద్దరు లీడింగ్ స్టార్స్ ఇరు వర్గాల ఫ్యాన్స్ ను శాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. అందుకే సినిమా జరుగుతున్నన్నాళ్లు ఇద్దరికి కథ పరంగా పర్ఫెక్ట్ గైడెన్స్ ఇచ్చేలా సెట్స్ లో వారికి సెపరేట్ సెట్ ఏర్పాటు చేశాడట. అంతేకాదు సినిమా యూనిట్ అందరు కూడా అక్కడే ఉండేలా పెద్ద హౌజ్ సెటప్ వేశారట.


ఈ ఐడియా రాజమౌళికి బిగ్ బాస్ సెట్ చూశాక వచ్చిందని తెలుస్తుంది. బిగ్ బాస్ లో కంటెస్టంట్స్ అందరు ఒకే చోట ఉంటారు. అయితే వారిని నిత్యం కెమెరాలు గమనిస్తూనే ఉంటాయి. వారు అక్కడ ఉండటమే బిగ్ బాస్ గేం ప్లాన్. కాని రాజమౌళి ఇంటి సెట్ లో మాత్రం రోజు మొత్తం షూటింగ్ కార్యక్రమాలు చూడటం మిగతా టైంలో రెస్ట్ తీసుకోవడం. ఒకే చోట చిత్రయూనిట్ ఉండేలా ప్లాన్ చేశాడట.


మొత్తానికి రాజమౌళి ఆలోచనలను బిగ్ బాస్ మర్చేసింది అన్నమాట. బిగ్ బాస్ అంటే 100 రోజులు కాని రాజమౌళి సినిమా అలా కాదు. కనీసం రెండేళ్లు పడుతుంది. మధ్యలో షూటింగ్ బ్రేజ్ ఇస్తేనే చిత్రయూనిట్ తమ ఫ్యామిలీస్ ను కలిసే అవకాశం ఉంటుంది. ఇక హాలీడేస్ కూడా వారికి అప్పుడే. మరి రాజమౌళి బిగ్ బాస్ సెట్ ప్రభావం ఎలా ఉండబోతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: