మాస్ మహరాజ్ రవితేజ శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా అమర్ అక్బర్ ఆంటోనీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ సరసన ఇలియానా హీరోయిన్ గా నటించింది. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ హడావిడిలో రవితేజ, శ్రీను వైట్ల బిజీగా ఉన్నారు.


అమర్, అక్బర్, ఆంటోనీ మూడు పాత్రల్లో రవితేజ కనిపిస్తున్నాడు. అయితే ముగ్గురిగా కనిపించేది ఒక వ్యక్తే అని తెలుస్తుంది. చిన్నప్పుడు తనకు జరిగిన అన్యాయం తెలుసుకుని శత్రువుల మీద పగతో పెరిగిన ఓ కుర్రాడు.. ముగ్గురు పాత్రలతో వారి ఆట కట్టించేస్తాడని తెలుస్తుంది. అయితే ముగ్గురు పాత్రలు ఒకరే చేస్తున్నట్టుగా ఆడియెన్స్ కు కూడా తెలియకుండా థ్రిల్ అయ్యేలా చేశాడట.  


ఇల ఒకే పాత్ర ముగ్గురిగా ప్రవర్తించడం అపరిచితుడులో ఉంది. శంకర్ డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమాలో చియాన్ విక్రం నట విశ్వరూపం చూపించారు. అయితే అదో సోషల్ మెసేజ్ గా వచ్చి సూపర్ సక్సెస్ అందుకుంది. అయితే అలాంటి కథలతో వేరే హీరోలు రెండు మూడు సినిమాలొచ్చినా వర్క్ అవుట్ కాలేదు.


అయితే రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ మాత్రం కచ్చితంగా అలరించేలా ఉంటుందని చెబుతున్నారు. సినిమాలో శ్రీను వైట్ల మార్క్ కామెడీ కూడా అలరిస్తుందట. ముఖ్యంగా ఓల్ ఆంధ్రా తెలంగాణా అశోషియేషన్ అంటూ కామెడీ ట్రూప్ పండించే కామెడీ కడుపుబ్బా నవ్విస్తుందని అంటున్నారు. మరి అపరిచితుడుకి ట్రిపుల్ ఏ కు పోలికలేంటో మరో 48 గంటల్లో తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: