టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ జాతీయ స్థాయిలో తెలుగుగోడి సత్తా చాటిన సినిమాల చాలా తక్కువే ఉన్నాయి.  ‘స్టూడెంట్ నెం.1’ సినిమాతో దర్శకుడిగా వెండి తెరకు పరిచయం అయిన ఎస్ ఎస్ రాజమౌళి అప్పటి నుంచి ఆ మద్య రిటీజ్ అయిన ‘బాహుబలి2’ వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అందించారు.  ఒక సినిమాలో హీరో లేకుండా కేవలం చిన్న ఈగ లాంటి ప్రాణితో ఏ రేంజ్ లో పగ తీర్చుకుంటారో ‘ఈగ’సినిమాలో చూపించాడు.  ఆ సినిమాలో రాజమౌళి వాడిన గ్రాఫిక్స్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.  ఆ తర్వాత హీరో ప్రభాస్ తో ‘బాహుబలి’, ‘బాహుబలి2’ సినిమాలు ఐదు సంవత్సరాలు కష్టపడి తీసి జాతీయ స్థాయిలో తెలుగు సినిమా గొప్పతనం ఏంటో రుచి చూపించాడు.  అప్పటి వరకు బాలీవుడ్ , కోలీవుడ్ లో ఉండే ఖాతాలన్ని తిరగరాశాడు. 
Image result for ‘ఆర్ఆర్ఆర్’ మూవీ
‘బాహుబలి2’సినిమా తర్వాత సంవత్సరం పాటు గ్యాప్ తీసుకున్న రాజమౌళి ఇప్పుడు తన తదుపరి సినిమాను మొదలుపెట్టేశాడు. ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే సందడి మొదలుపెట్టేసి.. ముహూర్తం ఈవెంట్ కూడా ఫినిష్‌ చేసి.. షూటింగ్ కు వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాడు. ఈ మద్య స్టార్ హీరోల సినిమాలు షూటింగ్ స్పాట్స్ లీక్ కావడం..హీరో ఏ గెటప్ లో ఉంటాడో..లొకేషన్ ఎలా ఉంటుందో మొత్తం లీక్ కావడంతో సినిమాలపై క్రేజ్ తగ్గిపోతుంది.  పలనా సినిమాలో తమ అభిమాన హీరో ఇలా ఉండబోతున్నాడని..రక రకాలుగా ఊహించుకుంటు రక రకాల కథలు అల్లేస్తున్నాు. 
Image result for RRR movie opening
ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న విషయం కూడా లీక్ అవ్వకుండా ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.  అసలు ‘ఆర్ ఆర్ ఆర్’షూటింగ్ సెట్లోకి సెల్‌ ఫోన్ అనేదే తీసుకురానివ్వరు. కాబట్టి ఎవరన్నా ఫోటోలో తీసి బయటకు లీక్ చేస్తారు అనే సందేహమే లేదు.   ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారును కోకాపేటలో వేసిన సెట్ పలానా అంటగా అని మనం సినిమా రిలీజయ్యాక తెలుసుకోవాల్సిందే కాని.. ఇప్పుడు మనకు ఆ సెట్ తాలూకు ఫోటోలు అయితే రిలీజ్ చేయరు.  దీనికి కారణం ఏంటో తెలిస్తే..అందరూ షాక్ అవుతారు. 

 తాను షూటింగ్ లో ఉండగా ఎవరైనా సీక్రెట్ కెమెరాలు సెట్ చేసినా..సీక్రెట్ గా సెల్ ఫోన్లో చిత్రీకరించినా తాను తీయబోయే సినిమాకు డ్యామేజ్ అవుతుందని భావించిన జక్కన్న చైనా నుండి తెప్పించిన జామర్స్ ను సెట్లో అమర్చడం వలన.. ఇలాంటి సీక్రెట్ కెమెరాలు పనిచేయకుండా చూసుకునే టెక్నాలజీ అవి అందిస్తాయట.  ఏది ఏమైనా ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో రాజమౌళి మామూలు సీక్రెట్ మెయిన్టయిన్ చేయడన్నమాట. 


మరింత సమాచారం తెలుసుకోండి: