తెలుగు సినిమాను ఏళ్ళకు ఏళ్ళు చెక్కడంలో ఆయన్ని మించిన వారు లేరు. ఇన్నేళ్ళు చెక్కినా కూడా అది డి అద్భుత శిల్పమే అవుతుంది కానీ అణా కాణీగా మారిపోదు. అదే ఆయన ప్రత్యేకత. అందుకే అందరూ ముద్దుగా జక్కన్న అని పిలుస్తారు. వరస విజయాలతో ఓటమి ఎరగని దర్శక ధీరుడు రాజమౌళి. ఇపుడు ఆయన ఇంట్లో ఓ శుభ కార్యానికి రంగం సిధ్ధం అవుతోంది. కొత్త ఏడాది సరి కొత్త ఉత్సాహంతో రాజమౌళి.  ఆ వేడుకల్లో పాలుపంచునేందుకు ఇప్పటి నుంచే బిజీ అయిపోయారు.


రాజమౌళి, రమా రాజమౌళిల ఏకైక పుత్రరత్నం కార్తికేయ ప్రేమ   వివాహం జనవరి 5న హైదరాబాద్ లో  జరబోతోంది. తెలుగు హీరో జగపతిబాబు అన్న రాం ప్రసాద్ కుమార్తె పూజ ప్రసాద్ ని కార్తికేయ చాలా కాలంగా ప్రేమిస్తున్నారు. ఈ ఇద్దరూ సెప్టెంబర్ నెలల్లో పెద్దల సమక్షంలో నిశ్ఛితార్ధం జరిగి పెళ్ళికి సిధ్ధమయ్యారు. నిశ్ఛితార్ధానికి తక్కువ మందిని మాత్రమే పిలిచిన రాజమౌలి కొడుకు పెళ్ళిని మాత్రం ఓ లెవెల్లో గ్రాండ్ గా  చెయబోతున్నారట. 


ఇందుకోసం రామానాయుడు స్టూడియోను వివాహ వేదికగా ఎంపిక చేశారు. టాలీవుడ్ తో పాటు, అన్ని రాష్ట్రాలకు చెందిన చిత్ర ప్రముఖులతో పాటు, రాజకీయ రంగానికి చెందిన సెలిబ్రిటీస్ కూడా ఈ పెళ్ళికి హాజరవుతారని అంటున్నారు. కార్తికేయ బాహుబలి మూవీకి రెండవ యూనిట్ డైరెక్టర్ గా పని చేసి తండ్రి విజయంలో భాగం  అయ్యాడు. ఇపుడు సొంతంగా ఓ మూవీని తీయబోతున్నాడు. ఇక పూజా ప్రసాద్ గాయనిగా మంచి పేరు తెచ్చుకుంది, ఈ జంట రేపు టాలీవుడ్లో ఎన్ని సంచలనాలు నమోదు చేస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: