టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలు వచ్చారు.  గత కొంత కాలంగా స్టార్ హీరోల వారసులు సైతం హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.  అయితే వారు స్టార్ హీరో స్థాయికి రావడానికి ఎన్నో సినిమాలు తీయాల్సి వచ్చింది..కొన్ని హిట్ అయితే కొన్ని అట్టర్ ఫ్లాప్.  దాంతో తమ కెరీర్ ఎలా నిలుస్తుందా అన్న టెన్షన్ తోనే సినిమాలు తీస్తున్నారు.  కానీ వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందుకొని తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ.  నాని నటించిన ఎవడే సుబ్రమాణ్యం సినిమాలో చిన్న పాత్రతో కనిపించిన మంచి జోష్ ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్నాడు.  

Related image

ఇక తరుణ్ బాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లిచూపులు’సినిమాలో తన సహజమైన నటనతో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు.  సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు విజయ్ దేవరకొండ.  ఈ సంవత్సరం ‘గీతాగోవిందం’ సినిమాతో ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరిన యువ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతో విజయ్ దేవరకొండతో సినిమాలు తీయడానికి దర్శకనిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు.  

Image result for nota movie

 'గీత గోవిందం' భారీ విజయాన్ని సొంతం తర్వాత 'నోటా' అభిమానులను నిరాశ పరిచింది. తాజాగా ఈ విషయాన్ని గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..ఒకే సమయంలో నేను 'గీత గోవిందం' .. 'టాక్సీవాలా' .. 'నోటా' చేయవలసి వచ్చింది.  ఆ సమయంలో బిజీ బిజీగా షూటింగ్స్ కి హాజరు కావాల్సి వచ్చింది..దాంతో 'నోటా' కథపై పూర్తిగా ఫోకస్ పెట్టలేకపోయాను.

Related image

 ఆ సినిమాలోని పాయింట్ ను మరింత బలంగా చెబితే బాగుండేదేనని ఆ తరువాత అనిపించింది.  అదృష్టం ఏంటంటే ఈ సినిమా పెద్దగా నష్టపోలేదు.  ‘నోటా’సినిమా తర్వాత ఒక బలమైన ఆలోచన చేశానని.. హడావిడిగా సినిమాలు చేయకుండా కాస్త గ్యాప్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: