భాతర దేశంలో ఇప్పుడు ‘మీ టూ’ఉద్యమం భారీ రేంజ్ లో కొనసాగుతుంది.  హాలీవుడ్ లో మొదలైన ఈ ఉద్యమం ఇప్పుడు భారత దేశంలో మొదలైంది.  ఆ మద్య సినీ నటి శ్రీరెడ్డి టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని పెద్ద హడావుడి చేసిన విషయం తెలిసిందే.  ఆమె ఉద్యమం తీవ్రస్థాయికి వచ్చే సమయానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ పై కామెంట్స్ చేయడంతో ఆమెపై విమర్శలు మొదలైన విషయం తెలిసిందే.  మీ టూ ఉద్యమం బాలీవుడ్ లో ప్రకపంణలు సృష్టించాయి.  తనూశ్రీ దత్త  పది సంవత్సరాల క్రితం తనపై ప్రముఖ నటుడు నానా పటేకర్ లైంగిక వేధింపులు చేశాడని సంచలన ఆరోపణలు చేసింది. 
Image result for kantana rounat tanusre datta\
ఆమెతో పాటు కంగనా రౌనత్ సైతం గతంలో తనపై కొంత మంది లైంగిక వేధింపులు చేశారని ఆరోపించింది.  ఇలా బాలీవుడ్ లో నటీమణులు ఇతరులు ‘మీ టూ’ ఉద్యమంలో భాగంగా సంచలన ఆరోపణలు చేశారు.  ఇక దక్షిణాధిన  ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు ఎంతో మంది అమ్మాయిలను లైంగికంగా వేధించాడని చెప్పి దక్షిణాది 'మీటూ' ఉద్యమానికి కేంద్రంగా మారింది ప్రముఖ సింగర్ చిన్మయి.  తాజాగా చిన్మయి కష్టాల్లో పడ్డట్లు చెబుతుంది..తన కెరీర్ ముగిసిందని అంటుంది. తమిళ డబ్బింగ్ యూనియన్ నుంచి ఆమె సభ్యత్వాన్ని తొలగించారట. 
Image result for viramuttu
ఈ సందర్భంగా రెండేళ్లూ తన డబ్బింగ్ ఫీజు నుంచి 10 శాతం మొత్తాన్ని అసోసియేషన్ ఎందుకు తీసుకుందని ప్రశ్నించింది. తనపై వేటు కొనసాగితే, ఇటీవలి '96' చిత్రంలో త్రిషకు తాను చెప్పిన డబ్బింగ్ చివరిదని ట్వీట్ చేసింది. తన కెరీర్ ముగిసినట్టేనని వ్యాఖ్యానించింది. డబ్బింగ్ యూనియన్ నాయకుడిగా ఉన్న రాజాపై ట్వీట్ చేస్తూ, అతను కూడా ఎంతోమందిని అవకాశాలు ఇప్పిస్తానని మోసం చేశాడని ఆరోపించింది. గతనెల 9న ఆమె ట్వీట్ చేస్తూ త్వరలో నా డబ్బింగ్ కెరీర్ నాశనం అవుతుంది. కాగా, చిన్మయి పెట్టిన ట్వీట్లను పలువురు సమర్థించగా, కొందరు విమర్శించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: