24కిస్సెస్ మూవీ ముద్దుల వర్షాన్ని నమ్ముకొని థియేటర్ లో అడుగు పెడుతుంది. ఇప్పటికే ట్రైలర్ లో చెప్పకనే చెప్పారు ఇందులో 24 ముద్దులు ఉంటాయని, అంటే ముద్దులు , లిప్ లాక్ లు ఈ సినిమా ను కాపాడతయని నిర్మాతలు భావిస్తున్నారు. అర్జున్ రెడ్డి’.. ‘ఆర్ఎక్స్ 100’ లాంటి సినిమాల తర్వాత లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్లతో సినిమాలు తీయడం పెరిగింది. ప్రేక్షకుల్ని ఆకర్సించడానికి దీన్నో మార్గంగా చూస్తున్నారు ఫిలిం మేకర్స్. ‘24 కిస్సెస్’ సినిమా కూడా ఇలాగే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఐతే ‘మిణుగురులు’ లాంటి మంచి సినిమా తీసిన అయోధ్యకుమార్ ఈ బాట పట్టడం విమర్శలకు దారి తీసింది.

Image result for hebba patel

ఐతే ఒక మంచి కథ చెప్పాలనుకుంటే ప్రేక్షకులు చూస్తారన్న గ్యారెంటీ లేదని.. అలాంటపుడు వాళ్లను ఆకర్షించడానికి ఇలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీలు తప్పవని అంటోంది ‘24 కిస్సెస్’ కథానాయిక హెబ్బా పటేల్. ముద్దుల్ని మాత్రమే చూసి థియేటర్లకు వస్తున్న జనాలు సినిమా చూసి కచ్చితంగా ఆశ్చర్యపోతారని ఆమె అంది.‘‘చాలామంది అసలు నువ్వెందుకు ఈ సినిమా ఎందుకు చేస్తున్నావ్‌.

ముద్దులు మార్కెటింగ్ స్ట్రాటజీ అంటున్న హాటీ

‘అర్జున్‌రెడ్డి’, ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాల ట్రెండ్‌ నడుస్తోంది కనుక చేస్తున్నావా అని అడిగారు కూడా. ఐతే ఆ సినిమాల కంటే ముందు ‘24 కిసెస్‌’ కథ వచ్చినా చేసేదాన్ని. కథకు అవసరమైతే లిప్ లాక్స్ అయినా ఇంకేవైనా. ‘24 కిసెస్‌’ చూస్తే ముద్దులకు కథలో ఎంత ప్రాధాన్యం ఉందో తెలుస్తుంది. ‘24 కిస్సెస్’ సినిమాకు సంబంధించి ముద్దుల మీదే ప్రేక్షకుల అటెన్షన్ ఉంది. ఇందుకు ప్రేక్షకులను తప్పు పట్టలేం. ఇందులో నేను హీరోయిన్‌ కాకపోతే... నేనూ అలాగే ఆలోచించేదాన్ని. ఐతే సినిమా మార్కెటింగ్‌ స్ట్రాటజీల్లో ఇదొకటి. ప్రేక్షకులు సినిమాలో ఓ విషయం ఉందని ఆశిస్తారు. థియేటర్లలో అంతకుమించి మరో విషయాన్ని చూస్తారు. ముద్దులతో పాటు అద్భుతమైన కథ ఉంటుంది. నటీనటుల అద్భుత ప్రతిభ ఉంటుంది’’ అని హెబ్బా చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: