'గజ' పెను తుపాను తమిళనాడు వాసులను గజగజ వణికించింది. వాతావరణ శాఖ అంచనాలకు అందకుండా వేగాన్ని, స్థితిని మార్చుకుంటూ ప్రళయరూపం దాల్చింది.  తుపాను ప్రభావిత జిల్లాల్లో దాదాపు 81 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ జిల్లాలతో పాటు ఇతర తీర ప్రాంతాల్లోనూ విద్యుత్తు సరఫరా నిలిపివేశారు.వరి, అరటి, కొబ్బరి పంటలు బాగా దెబ్బతిన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను కొనసాగించింది. 
Cyclone Gaja death toll touches 45 in Tamil Nadu
కాగా,  గజ తుపానుతో చిగురుటాకులా వణుకుతున్న తమిళనాడుకు అన్ని విధాలా సాయం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది.   తమిళనాడులో గజ తుపానుకు అధికారికంగా 45 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి మీడియాకు చెప్పారు.  ఇక కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇళయదళపతి విజయ్ కి ఎంతో మంచి పేరు ఉంది.  ప్రకృతి వైపరిత్యాల వల్ల నష్టపోయిన వారికి విరాళాలు ఇవ్వడంలో..వారిని ఆదుకోవడంలో విజయ్ ముందు ఉంటారని అంటారు. 
గజ తుపాను
గజ తుపాను  తమిళనాడు రాష్ట్రాన్ని అతలాకుతలం అయ్యిందన్న విషయం తెలిసిందే.  గజ తుఫాను బాధితులను ఆదుకునేందుకు విజయ్ ముందుకు వచ్చాడు. విజయ్‌కి తమిళనాడు అంతటా “విజయ్ మక్కల్ ఇయక్కం (విఎంఐ)” పేరిట అభిమాన సంఘాలున్నాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా ఈ అభిమాన సంఘాలు ముందుకొచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
Image result for గజ తుపాను
అభిమాన సంఘాల అధ్యక్షులలో ఒక్కొక్కరి బ్యాంకు అకౌంట్‌‌లో 4.5 లక్షల రూపాయలను విజయ్ డిపాజిట్ చేశారు. బాధితులకు కావాల్సిన నిత్యావసరాలను అందించి బాసటగా నిలవాలని కోరాడు. తమ అభిమాన హీరో దగ్గరుండి మరీ డబ్బులు వేసి మంచి కార్యక్రమం చేయమంటే..అభిమానులు ఎంతో ఉత్సాహంగా బాధితులకు కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నారు.  సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: