సినీపరిశ్రమలో లైంగిక వేధింపులపై మొదలైన ‘మీ టూ’ ఉద్యమం చాలామంది నటులు, దర్శకుల జాతకాలను మార్చేసింది. ముఖ్యంగా బాలీవుడ్ లో ‘మీ టూ ’ ఉద్యమం భారీ స్థాయిలో కొనసాగుతుంది.  నటి తనూశ్రీ దత్తా పది సంవత్సరాల క్రితం ప్రముఖ నటులు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడనని అంతే కాదు దర్శకుడు, కొరియోగ్రాఫర్ పై కూడా సంచలన ఆరోపణలు చేసింది. మరో నటి కంగనా రౌనత్ సైతం గతంలో తనపై కొంత మంది లైంగిక వేధింపులు చేశారని ఆరోపించింది. 
Image result for alok nath mintu nanda
ఇక నిర్మాత వింటా నందా.. ప్రముఖ సినీ, టివి నటుడు అలోక్ నాథ్ తనను అత్యాచారం చేశాడంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.  వింటా నందా, అలోక్ నాథ్ పై ఆరోపణలు చేసిన తరువాత చాలా మంది నటీమణులు అలోక్ నాథ్ తమని కూడా లైంగిక వేధింపులకు గురి చేశాడనే విషయాలను బయటపెట్టారు. ఇక అలోక్‌ నాథ్‌పై వచ్చిన లైంగిక ఆరోపణల నేపథ్యంలో సినీ, టీవీ ఆర్టిస్ట్‌ల సంఘం అతన్ని అసోసియేషన్ నుంచి బహిష్కరించింది. అయితే బాలీవుడ్ లో ఇప్పటి వరకు తన కెరీర్ లో ఇంత ఘోర అవమానం ఎప్పుడూ పొందలేదని..తన క్యారెక్టర్ గురించి అందరికీ తెలుసునని అలాంటి ఆరోపణలు ఎవ్వరూ చేయచేయలేదని అలోక్ వాదిస్తున్నారు. 
Related image
ఇందుకు ఆయన సతీమణి కూడా మద్దతు పలికింది.  ఈ నేపథ్యంలో అలోక్ నాథ్.. వింటా నందాపై పరువు నష్టం దావా కేసు వేశారు. అతడికి క్షమాపణలు చెప్పడంతో పాటు రూ.1 ఇవ్వాలని అలోక్ నాథ్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అలోక్ కి మరో షాక్ తగిలింది. తాజాగా అలోక్ కి అనుకోని షాక్ తగిలింది.   వింటా నందా ఫిర్యాదు మేరకు నటుడు అలోక్ నాథ్ పై రేప్ కేసు నమోదు చేశారు ముంబై పోలీసులు. ఓషివారాకి చెందిన పోలీసులు అలోక్ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసినట్లు పోలీస్ అధికారి మనోజ్ శర్మ వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: