సినిమా రంగంలో హీరోయిన్లు గ్రామర్ పాత్రలే చేస్తాను, గ్లామర్ కి దూరమని  అంటే కుదిరే రోజులు కావివి. అయితే కొందరికి పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారక్టర్స్ లక్కీగా వస్తూంటాయి. దాంతో నేం అండ్ ఫేం కూడా బాగా వస్తుంది. అయితే వాటినే మళ్ళీ రావాలని కోరుకోవడం అత్యాశ అవుతుంది. అలా గిరి గీసుకుని కూర్చూంటే అసలుకే ఎసరు వచ్చి ఉన్న చాన్సులు కూడా పోతాయి. తెలివైన వాళ్ళు మాత్రం అన్ని రకాలూ చేస్తామని స్టేట్మెంట్లు ఇవ్వడమే కాదు. రెడీ కూడా అయిపోతారు.


ఇపుడు అదే వరసలో కీర్తి సురేష్ నేను రెడీ అంటోంది. మహానటి మూవీతో కొత్త ఇమేజ్ ని సొంతం చేసుకున్న కీర్తిని అంతా సావిత్రి అంటున్నారు. దాంతో ఆమె యూత్ కి కనెక్ట్ కాలేకపోతోంది. ఆమె ఏజ్ గ్రూప్ హీరోలతో ఆడి పాడేందుకు రెడీ అంటున్నా ఎవరూ డేర్ చేయలేకపోతున్నారుట. ఓ విధంగా ఆ మూవీ కి ఆమెకు ప్లస్ నే కాదు మైనస్సు అయిందని అంటున్నారు. జూనియర్ సావిత్రి పక్కన మేము  హీరోలుగా తేలిపోతామేమో అంటున్నారట. దీనికి తెర దించేందుకు ఏకంగా ఈ వెండి తెర సావిత్రి తనకు తానుగానే ముందుకు వచ్చింది


గ్లామర్ షోకు నేను రెడీ అంటూ భారీ స్టేట్మెంట్ ఇచ్చేసింది. అంతే కాదు. వీలు కుదిరితే అందాల‌ అరబోతకు కూడా సిధ్ధమని ప్రకటించింది. పాత్ర డిమాండ్ చేయాలి అని చిన్న మెలిక పెట్టినా కీర్తి ఒకే అనడం ద్వారా చాన్సులను పట్టేయాలన్న బిగ్ ప్లాన్ తోనే ఉందని అంటున్నారు. ఆమెను ఆర్ ఆర్ ఆర్ మూవీలో తీసుకుంటారని టాక్ నడుస్తున్నా ఇంకా కంఫర్మ్ కాలేదు.


ఇక ఆమెకు మహానటి తరువాత యూత్ హీరోలతో అవకాశాలు రావడం లేదు. దీంతోనే కీర్తి ఈ విధంగా ముందుకు వచ్చిందని అంటున్నారు. మొత్తానికి కీర్తి  వంటి అందగత్తె అందాలను ఆరబోస్తానని చెబితే ఏ నిర్మాత, దర్శకుడు ఊరుకుంటాడు. ఇక కుప్పలు తెప్పలుగా అవకాశాలు కీర్తిని వెంటాడడం ష్యూర్ అంటున్నారు. చూడాలి మహానటి జాతకం ఎలా ఉంటుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: