ఆమె మొదటి చిత్రంలో మెరుపు తీగ. కేవలం తన అందాలతో చిత్రం నిలబెట్టేసింది. ఆనాటి కుర్ర కారుకు కిర్రాకు పుట్టించింది. చూసిన ప్రతి ఒక్కరూ దేవదాసే అయ్యారు. ఆ తరువాత ఆమె స్టార్ స్టాటస్ సాధించి టాప్ హీరోయిన్ అయిపోయింది. చూస్తుండగానే టాప్ స్టార్స్ అందరితో సందడి చేసి వెండి తెర రాణి అనిపించుకుంది. మహెష్ తో పోకిరి చేసినా, బన్నీతో దేశ ముదురు చేసినా ఆమె సొగసు సోయగాలు ఎంత ప్లస్ అయ్యాయో చెప్పనక్కరలేదు అప్పట్లొ రవితేజాతో కలసి చేసిన కిక్కు  టాలీవుడ్ కి కొత్త కిక్కు ఇచ్చేసిందిగా


బాలీవుడ్ కోసం పరుగులు తీసిన ఆ గోవా సుందరి ఇలియానా చిరునామా పట్టుకోవడం కష్టమైపోయింది. మళ్ళీ చాన్నాళ్ళకు గోవా అందాలు చూసే అవకాశం, అద్రుష్టం దర్శకుడి శ్రీను వైట్ల, హీరో రవితేజా కలిగించారు. ఈ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ అమర్ అక్బర్ ఆంతోనీ మూవీలో స్పేషల్ అట్రాక్షన్ ఇలియానా అనుకున్నారు. కానీ సినిమా చూసిన వారు ఆమే పెద్ద మైనస్ అని తేల్చేశారు. ఈ గోవా బ్యూటి ఆనాటిది కాదని కూడా పెదవి విరిచేశారు. ఆమె వంపులు సొంపులు చూసిన వారంతా ఇదేంటి ఇలా లావుగా అయిపోయిందని ఘాటు కామెంట్స్ కూడా చేశారు



ఇక సినిమా చూసినా తొలిరోజే డిజాస్టర్ గా డిక్లేర్ చేసుకుంది. దాంతో ఇలియానా క్లిక్ అయితే మరిన్ని మూవీస్ చేద్దామనుకున్న టాలీవుడ్ నిర్మాతలు మనసు మార్చుకున్నారట. విషయం తెలిసిన గోవా బ్యూటీ గో టూ  పెవిలియన్ అంటోంది. అంతేనా తన ప్రయారిటీ మళ్ళీ బాలీవుడ్డేనని చెబుతోంది. ఓ వైపు పీకల్లోతొ ప్రేమలో మునిగితేలుతున్న గోవా బ్యూటీకి అక్కడ కూడా చేసేందుకు ఏమీ లేవని, ఇక పెళ్ళి చేసుకోవడమే తరువాయి అని సెటైర్లు పడుతున్నాయి. మొత్తానికి ఇలియనా తన వెనకటి అందం మెరుపులు మసకబార్చుకుని మాజీ బ్యూటీగానే టాలీవుడ్ కి మిగిలిపోయిందంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: