నాచురల్ స్టార్ నానితో సినిమా ఛాన్స్ అంటే ఏ హీరోయిన్ అయినా చేయనని చెప్పదు. ఆల్రెడీ నానితో ఓ సినిమా చేసి అది కూడా హిట్ కొట్టిన అమ్మడైతే అసలు అవకాశం వదలదు కాని నాని సినిమా ఛాన్స్ వచ్చినా సరే మల్టీస్టారర్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చిందని నానికి హ్యాండ్ ఇచ్చింది ఓ హీరోయిన్.


ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అంటే మహానటి కీర్తి సురేష్ అని తెలుస్తుంది. నానితో నేను లోకల్ సినిమా చేసిన ఈ అమ్మడు ఆ తర్వాత తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న కీర్తికి నానితో నటించే అవకాశం వచ్చినా అదే టైంలో రాజమౌళి మల్టీస్టారర్ ఆర్.ఆర్.ఆర్ ఛాన్స్ వచ్చేసరికి నాని సినిమా కాదన్నదట.


ఎన్.టి.ఆర్, చరణ్ తో కలిసి చేస్తున్న రాజమౌళి ట్రిపుల్ ఆర్ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ అవసరం ఉండగా అందులో ఒక ఛాన్స్ కీర్తి సురేష్ అందుకుందట. మరో హీరోయిన్ గా రష్మికకు అవకాశం ఉందని అంటున్నారు. కీర్తి సురేష్, రష్మిక ఇద్దరు తెలుగులో మంచి ఫాంలో ఉన్న కథానాయికలు. ఆ ఇద్దరిని ట్రిపుల్ ఆర్ లో తీసుకుంటే సినిమాకు మరింత క్రేజ్ వస్తుందని భావిస్తున్నాడట రాజమౌళి.


బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా అందులో ఇద్దరు హీరోల మల్టీస్టారర్ అందుకే కీర్తి ఈ సినిమా ఛాన్స్ వదులుకోలేదు. నానితో సినిమా మళ్లీ వస్తుందేమో కాని జక్కన్న సినిమా అసలు రాదు. అందుకే కీర్తి ట్రిపుల్ ఆర్ కు సై అన్నదట. మరి సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుంది. కీర్తి సురేష్ కెరియర్ కు ఈ సినిమా ఏవిధంగా ఉపయోగపడుతుంది అన్నది వేచి చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: