హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న కైరాదత్ లేటెస్ట్ గా ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఫోటో పోస్ట్ చేసిన ఓ ఫోజు ఇపుడు నెటిజన్లను ఓ రేంజిలో కిక్కెక్కిస్తోంది. మత్తు కళ్ళతో, ఒంపు సొంపులతో కైరా కుర్ర కారు గుండెలను  కైమా కొట్టేస్తోంది. మైమరపించే సొగసులతో గుమ్మెత్తిస్తోంది. ఈ భామను చూస్తే చాలు చిన్న పిల్లలు బూచాడు అంటే ఎలా జ్వరం పెట్టేసుకుంటారో అలాంటి చలి జ్వరమే పోరగాళ్ళకు వచ్చేస్తుంది సైరా అంటూ కైరా ఫోజిస్తే ఔరా అని నోళ్ళెళ్ళబెట్టడమే అవుతుందిగా. 


ఇంతకీ కైరాదత్ గురించి చెప్పలేదు కదూ. ఈ భామా తెలుగు వారికి పరిచయమే.   అల్లు అర్జున్ సూపర్ హిట్ ఫిలిం 'రేస్ గుర్రం' లో 'బూచాడే బూచాడే' సాంగ్ లోనూ నందమూరి బాలకృష్ణ 'పైసా వసూల్' లోనూ నటించింది. ఆ రెండు మూవీస్ లోనూ కైరా గ్లామర్ వెండితెరను నిండు పున్నమిలా పరచేసుకుంది. ఐటెం  బాంబులా కైరా తెర ముందు చేసిన విన్యాసానికి యూత్ ఓ రెంజిలో కనెక్ట్ అయిపోయారు. పైసా వసూల్ సరిగా ఆడకపోయినా కైరాను మాత్రం యూత్ కళ్ళకు కట్టేసుకున్నారు.


అందాలను పరచేయడానికి ఏ మాత్రం అభ్యంతరం లేని ఈ భామ బాలాజీ టెలిఫిలిమ్స్ వారి హాట్ వెబ్ సిరీస్ 'XXX: అన్ సెన్సార్డ్' లో నటించి ప్రేక్షకులకు కిక్కిచ్చింది.  ఈ హాటీ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఘాటు ఫోటోలతో విరుచుకుపడుతూ ఉంటుంది. కింగ్ ఫిషర్ క్యాలెండర్ గర్ల్ అయిన ఈ భామకు హాట్ ఫోటోలనేవి కొట్టిన పిండి.  తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఫోటో పోస్ట్ చేసి "నా ఒంపులంటే నాకు ప్రేమ. #మీరెవ్వరు నన్ను బాడీ షేమింగ్ చెయ్యలేరు" అనే బోల్డ్ క్యాప్షన్ ఇచ్చింది.  మరి చూసుకోండి ఇక కైరాదత్ సవాల్. కిర్రాక్ పెట్టిస్తున్న లేటెస్ట్ ఫోజుకు ఎవరైన సలాం చెయాల్సిందే మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: