యువ హీరోల్లో ఒక హిట్టు రెండు ఫ్లాపులు అన్న చందాన కెరియర్ సాగిస్తున్న నితిన్ అ.. ఆ తర్వాత మళ్లీ హిట్ కోసం తపిస్తున్నాడు. లై, ఛల్ మోహన్ రంగ సినిమాలు రెండు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో నితిన్ కెరియర్ మళ్లీ సందిగ్ధంలో పడింది. అందుకే మిగతా హీరోల్లా క్రేజీ డెశిషన్స్ తీసుకుంటున్నాడట.


అందులో భాగంగా నితిన్ ఓ తమిళ సూపర్ హిట్ సినిమా హక్కులను కొన్నాడట. కోలీవుడ్ లో విష్ణు విశాల్ హీరోగా వచ్చిన సినిమా రాక్షసన్. తమిళనాట విజయాన్ని అందుకున్న ఈ సినిమా రీమేక్ రైట్స్ నితిన్ కొన్నాడట. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీపై నితిన్ కన్ను పడ్డది.


అయితే నితిన్ ఇమేజ్ కు ఈ రాక్షసన్ అసలు సూట్ అవదు. ఒకవేళ ఈసారి పూర్తిస్థాయిలో మేకోవర్ చేస్తాడా.. అంత సాహసం నితిన్ చేయగలడా అన్నది ఇండస్ట్రీ టాక్. ఇక ప్రస్తుతం ఛలో డైరక్టర్ వెంకీ కుడుముల డైరక్షన్ లో నితిన్ ఓ సినిమా కన్ఫాం చేశాడు. క్రేజీ బ్యూటీ రష్మిక మందన ఈ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది.  


మరి నితిన్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. నితిన్ అర్జెంట్ గా హిట్ కొట్టాల్సిన ఈ టైంలో చేస్తున్న ఈ సాహసం వరు అవుట్ అవుతుందో లేదో సినిమాలు వస్తేనే కాని తెలుస్తుంది. వెంకీ కుడుముల డైరక్షన్ లో మూవీపై కూడా అప్డేట్ రావాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: