సూపర్ స్టార్ మహేష్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా మరోపక్క యాడ్స్ చేస్తూనే ఉంటాడు. సౌత్ హీరోల్లో వాణిజ్య పరకటనల మీద సంపాదించే స్టార్స్ లో మహేష్ నంబర్ 1 అంటే ఒప్పుకోవాల్సిందే. ఇక కొన్నాళ్లుగా సాఫ్ట్ డ్రింక్ థమ్స్ అప్ కు మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నాడని తెలిసిందే.


యాడ్ తో ప్రజల దగ్గరకు తమ ప్రొడక్ట్స్ తీసుకెళ్లే కంపెనీలు.. థమ్స్ అప్ ను మహేష్ ద్వారా ప్రజలకు చేరువయ్యేలా చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈసారి థంస్ అప్ కోసం మహేష్ చేసిన స్టంట్స్ అదిరిపోయాయి. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా వచ్చిన ఈ యాడ్ మహేష్ అభిమానులను మెప్పిస్తుంది. సినిమాల్లో కూడా రిస్కీ షాట్స్ థమ్స్ యాడ్ కోసం చేశాడు మహేష్.


అది తనే ఒప్పుకున్నాడు కూడా.. వన్ ఆఫ్ ది మోస్ట్ యాక్షన్ ప్యాక్డ్ యాడ్.. అంటూ తాను చేసిన యాడ్స్ లో ఇదే ప్రధమం అంటూ థమ్స్ అప్ యాడ్ పై తన మనసులో మాట బయటపెట్టాడు మహేష్. అంతేకాదు గాయ్స్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా అంటూ ట్వీట్ చేశాడు. కచ్చితంగా మహేష్ చేసిన ఈ యాడ్ అభిమానులకు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. 


ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మహేష్ మహర్షి సినిమా చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2019 ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నారు. దిల్ రాజు, అశ్వనిదత్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: