సినిమా వాళ్ళకు చిత్రం బాగా రావడం ఎంత ముఖ్యమో రిలీజ్ కూడా అంతే ముఖ్యం. సరైన డేట్ ఉంటే క్యూ కట్టి మరీ కర్చీఫ్ వేసేస్తారు. మరి అలా అందరూ పొలోమని ఒకే డేట్ మీద కూర్చుకుంటే బొమ్మాడేదెట్టా. అయితే ఎవరూ తగ్గరుగా. అందరూ అందరే ఒకరి తరువాత ఒకరుగా ఒకే డేట్ పట్టుకుని వేళ్లాడుతున్నారు. అంతటి క్రేజ్ ఆ రోజుకు ఉందా వీళ్లే కోరి మరీ ఇచ్చేశారా. ఇంతకీ ఆ డేట్ ఏంటంటే డిసెంబర్ 7. ఆ రోజున టాలివుడ్లో ఒకటి కాదు, ఏకంగా నాలుగైదు మూవీస్ రిలీజ్ అవుతున్నాయి.


డిసెంబర్ ఏడవ తేదీన నాలుగు చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ మూవీస్ కి ఆ డేట్ తప్పితే వేరే చాన్స్ లేదంట. ఎందుచేత‌నంటే డిసేంబర్ రాగానే సంక్రాంతి జాతర మొదలైపోతుంది. దాంతో అంత వరకూ ఖాళీగా కనిపించిన సినిమా హాళ్ళు పెద్ద సినిమాలతో ఫుల్లు అయిపోతాయి. ఇక చిన్న సినిమాకూ చోటు ఎక్కడా ఉందదు, ఈ సంగతి తెలిసే ఇపుడు ఆ ఒక్క డేట్ మీద చిన్న నిర్మాతలంతా పడిపొయారు. 


ఆ రోజున బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ కవచం వస్తోంది. ముందుగానే తాము ఈ డేట్ ఫిక్స్ చేసుకున్నామని నిర్మాతలు ప్రకటించేసారు. అదే రోజున అక్కినేని హీరో సుమంత్ సినిమా సుబ్రహ్మణ్యపురం సినిమా కూడా వస్తోంది. ఇదే తేదీన తమన్నా, సందీప్ కిషన్  మూవీ నెక్స్ట్ ఏంటి మూవీ వస్తోంది.


ఇక ఇదే డేట్ మీద మరో మూవీ శుభలేఖలు మూవీ కూడా కర్చీఫ్ వేసేసింది. చూడాలంటే నాలుగు సినిమాలు, అదీ ఒకే డేట్. కానీ ఇపుడున్న కాంపిటీషన్లో ఇన్ని సినిమాలు ఒకే మారు వస్తే పోటీ తో వాటికే దెబ్బ అంటున్నారు. ఇంతకీ డిసెంబర్ 7న మరో విషయం కూడా ఉంది. అదే తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు, మరి ఆ సందడి చూస్తారా, సినిమాకి వస్తారా. ఏది ఏమైనా ఈ డేట్ వెరీ హాట్ గురూ అన్న‌ట్లుగా ఉంది కదూ..


మరింత సమాచారం తెలుసుకోండి: