తెలుగు సినిమాను 80 దశకంలో ఓ ఊపు వూపిన జయద్వయం అప్పటి కుర్ర కారుని కిర్రెకించారు. టాప్ హీరోల పక్కన నటించి సూపర్ స్టార్ డం ఎంజాయ్ చేశారు. జయసుధ, జయప్రద అంటే అప్పట్లో జనం వారిని చూసి సినిమాలకు ఎగబడి వెళ్ళేవారు. అటు నందమూరి, ఇటు అక్కినేని పక్కన చక్కగా ఒదిగిపోయిన ఈ ఇద్దరు హీరోయిన్లు సినిమా ప్రపంచానికే సరి కొత్త గ్లామర్ అద్దారు. ఈ తరానికి మళ్ళీ వీరిద్దరినీ చూపించబోతున్నారు అన్న గారి బయోపిక్ ద్వారా.


ఈ మూవీలో అన్న గారుగా నటిస్తున్న బాలయ్య కూడా 80 దశకం హీరోనే. చిత్రమేంటంటే బాలయ్యకు అప్పట్లోనే జయసుధ, జయప్రదల పక్కన నటించే చాన్స్ వచ్చింది. శివరంజని మూవీలో తొలుత బాలయ్యనే హీరోగా పెట్టాలని దర్శకుడు దాసరి నారాయణరావు అన్న గారిని కలిశారు. అయితే బాలయ్య అపుడు డిగ్రీ చదువుతున్నారు. దాంతో చదువు పాడవుతుందని అన్న గారే వద్దనేశారు


. అలా జయసుధతో నాడు నటించే చాన్స్ బాలయ్య పోగొట్టుకున్నారు.అయితే నాలుగేళ్ళ క్రితం వచ్చిన అధినాయకుడు మూవీలో మాత్రం పెద్దాయన పాత్రలో బాలయ్య పక్కన జయసుధ జోడీగా కనిపిస్తారు. అయితే ఆడి పాడిన ముచ్చట మాత్రం బాలయ్యకు జాయసుధ జంటకు తీరలేదు.


ఇక జయప్రద విషయానికి వస్తే యమగోల మూవీలో మొదట బాలక్రిష్ణను హీరోగా, అన్న గారిని యముడుగా పెట్టుకుని  తీయాలనుకుని నిర్మాతలు అప్రోచ్ అయ్యారట. ఇక్కడ కూడా అన్నగారు బాలయ్య చదువు కారణం చెప్పి తానే బాలయ్య వేయాల్సిన పాత్ర పోషించి సూపర్ హిట్ కొట్టారు.


అపుడు కనుక అన్న గారు ఒకే అంటే జయప్రద పక్కన బాలయ్య ఎపుడో నటిచి ఆడి పాడేసేవారే. ఆ తరువాత ఈ ఇద్దరి కాంబో కుదరకపోయినా అన్న గారి బయోపిక్ పుణ్యామాని నాటి జయసుధ, జయప్రదల డూపులతో బాలయ్య ఆడి పాడబోతున్నారు. ఈ బయోపిక్ లో జయసుధగా పాయల్ రాజ్ పుత్ నటిస్తూండగా, జయప్రదగా హన్సికను ఎంపిక చేశారని తెలిసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: