సౌత్ లో క్రేజీ డైరక్టర్స్ లో శంకర్ ఒకరు. తన మొదటి సినిమా జెంటిల్ మన్ నుండి ఐ సినిమా ముందు వరకు ఎన్నో సంచనల విజయాలను అందుకున్నాడు. శంకర్, రజిని కాంబినేషన్ లో రోబో సీక్వల్ గా వస్తున్న సినిమా 2.ఓ. రోబో సినిమా ఎలాంటి అంచనాలు లేవు. అయితే కాంబినేషన్ పై అంచనాలున్నా కంటెంట్ మీద ఏ ఆలోచన లేదు.


అయితే ఒక్కసారిగా రోబో చేసిన అద్భుత విన్యాసాలను ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. చిట్టి రోబో సెన్సేషన్స్ అన్ని ఇన్ని కావు. కథ కథనాలు సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఐశ్వర్య అందం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. రెహమాన్ మ్యూజిక్ కూడా ప్లస్ అయ్యి సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేశాయి.


ఇక ఇప్పుడు రాబోతున్న 2.ఓ డబుల్ ట్రిపుల్ అంచనాలను ఏర్పరచుకుంది. క్రోమాన్ గా అక్షయ్ కుమార్ నటిస్తుండగా విలంగ్ ఆ అతని యాక్టింగ్ సినిమాకు అదనపు బలమని తెలుస్తుంది. ఇక రోబో చిట్టిగా రజిని మరోసారి అద్భుతం చేస్తాడని అంటున్నారు. సినిమా దాదాపు 6800 థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. 


600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 2.ఓ ముందు భారీ లక్ష్యమే ఉంది. శాటిలైట్, డిజిటల్ రైట్స్ రూపంలో 180 కోట్ల దాకా రాబట్టగా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం అదరగొట్టేసింది. తెలుగు రెండు రాష్ట్రాల్లో 2.ఓ 1200 థియేటర్స్ లో రిలీజ్ అవడం విశేషం. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: